బాల‌కృష్ణ‌, బోయ‌పాటి కాంబినేష‌న్‌లో చిత్రం తెర‌కెక్క‌బోతుంద‌న్న విష‌యం తెలిసిందే. ఇక ఈచిత్రంలో బాల‌య్య ప‌క్క‌న న‌టించ‌డానికి హీరోయిన్ దొర‌క్క వెతుకుతున్నారు. ఈ నేప‌ధ్యంలో ఈ సినిమాలో న‌టించ‌డానికి హీరోయిన్ కేథ‌రిన్ థెరిసా నిరాక‌రించిందంట‌. ఇటీవ‌లె విడుద‌లైన `రూల‌ర్` చిత్రంలో బాల‌కృష్ణ చాలా స్టైలిష్‌గా క‌నిపించిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రం ఎంతో భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కింది. ఇక బోయ‌పాటి చిత్రంలో కేథ‌రిన్‌ని హీరోయిన్‌గా  ఫైన‌ల్ చేసినా కూడా రెమ్యూన‌రేష‌న్ విష‌యంలో కాస్త అటూ ఇటూ అయి ఈ భామ కూడా కుద‌ర‌లేదు. బాల‌య్య‌తో క‌లిసి న‌టించ‌డానికి దాదాపు కేథ‌రిన్ కోటి రూపాయ‌ల వ‌ర‌కు డిమాండ్ చేసింద‌ట‌. ఇంత భారీ మొత్తంలో రెమ్యూన‌రేష‌న్ ఇవ్వ‌లేక నిర్మాత‌లు నిరాక‌రించారు. దీంతో కేథ‌రిన్ ఈ చిత్రం నుంచి త‌ప్పుకుంది. 

 

'ఇద్దరమ్మాయిలతో' సినిమాతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. బాల‌కృష్ణ‌, బోయ‌పాటి కాంబినేష‌న్‌లో చిత్రం అంటేనే ఫ్యాన్స్‌లో ఒక‌ర‌క‌మైన క్రేజ్ వ‌స్తుంది. ఇక ఈ చిత్రం వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కే మూడ‌వ చిత్ర‌మిది. ఇంత మంచి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కే చిత్రంలో మంచి అవ‌కాశాన్ని  వ‌దులుకుంద‌ని కొంద‌రు భావిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో బాలయ్య సరసన నటించే హీరోయిన్‌ కోసం బోయపాటికి తంటాలు తప్పడం లేదు. తరచుగా ఏదో ఒక హీరోయిన్‌ పేరు వినిపించడం.. తీరా ఓ కే అనుకునే స‌రికి మ‌ళ్ళీ కాద‌ని వార్త‌లు రావ‌డ‌మ‌నేది స‌ర్వ సాధార‌ణ‌మైపోయింది. కేథరిన్‌కి ముందు మిల్క్‌ బ్యూటీ తమన్నాను సంప్రదించగా ఆమె సున్నితంగా తిరస్కరించింది. 

 

ఇక‌ బాలీవుడ్‌ బ్యూటీ సోనాక్షి సిన్హా కూడా బాలయ్యతో జ‌త క‌ట్ట‌నంద‌ని వార్త‌లు వ‌చ్చాయి.  మొత్తానికి బాలయ్యకు హీరోయిన్‌ని వెతకడం బోయపాటికి కత్తిమీద  సాము లాంటిది. ఇక హీరోయిన్స్ ఎందుకు బాల‌య్య‌తో న‌టించ‌డానికి ఇష్ట‌ప‌డ‌డం లేదు. ఇంత పెద్ద  హీరోతో చేయ‌డం వ‌ల్ల వాళ్ళ ఇమేజ్‌కి ఏదైనా ఇబ్బంది ఉంటుంది అని భావిస్తున్నారా లేక మ‌రేద‌న్నా ఇబ్బందా అన్న‌ది తెలియ‌డం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: