దిల్ రాజులో క్లారిటి మిస్సయ్యిందా ..లేదా దిల్ రాజు విషయంలో జనాలు క్లారిటీ మిస్సవుతుందా తెలీదు. ఎందుకంటే ఆయన కొన్ని సినిమాలకు భారీగా ప్రమోషన్స్ చేస్తున్నారు. కొన్ని సినిమాలను అసలు పట్టించుకోవడం లేదు. ఆయన బ్యానర్లో తెరకెక్కిన కొన్ని చిన్న సినిమాలు అలా వచ్చి ఇలా పోతున్నాయి. అందుకు ఉదాహరణ మొన్న వచ్చిన రాజ్ తరుణ్ ఇద్దరి లోకం ఒకటే. ఈ సినిమాను అసలు పట్టించుకోనేలేదు రాజు గారు. ఈ విషయంలో నెటిజన్స్ కూడా బాగా ట్రోల్ చేశారు. ఇక పెద్ద హీరోల సినిమాలు ఆంటే ఆటోమేటిక్ గా ప్రేక్షకుల దృష్టి ఆ సినిమాలపై ఉంటుంది. కాబట్టి ప్రచారం తగ్గినా చేయకపోయినా హైప్ ఉంటుంది. కానీ స్మాల్.. మీడియం రేంజ్ సినిమాలకు ప్రచారమే ప్రమోషన్స్ చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న 'జాను' సినిమా పరిస్థితి కూడా అలానే ఉంది. తమిళంలో సూపర్ హిట్ అయిన సినిమా '96' కు రీమేక్ గా తెరకెక్కుతున్నప్పటికీ సరిగ్గా ప్రమోషన్స్ చేయడం లేదు. కావలసినంతగా హైప్ కూడా రావడంలేదు.

 

ఇక ముఖ్యంగా ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఎంతమేరకు కనెక్ట్ అవుతుంది అన్న విషయం కూడా దృష్ఠిలో ఉంచుకోవాల్సిన విషయం. అసలే తమిళ సినిమా. దానికి తోడు '96' స్లోగా నత్త నడకలా సాగే కథ. మనవాల్లకి స్క్రీన్ ప్లే పరిగెత్తాలి. లేదంటే సినిమా బాగా లేదు... పోయింది ..అంటూ కామెంట్స్ చేస్తారు. ఇక మన రెగ్యులర్ తెలుగు సినిమాల్లో కనిపించే కమర్షియల్ ఎలిమెంట్స్ అంటే మాంచి రొమాంటిక్ సాంగ్స్, అవసరమున్నా లేకపోయినా ఉండాల్సిన ఫైట్స్, కుళ్ళు కామెడి ..ఇలాంటివి లేకుండా సున్నితమైన భావోద్వేగాలతో సాగే కథ. తెలుగులో పెద్దగా మార్పులు లేకుండా తెరకెక్కిస్తున్నారని చిత్ర యూనిట్ ఇదివరకే హింట్ ఇచ్చారు. విభిన్నమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు కానీ నీరసంగా సాగే కథలను మాత్రం ఆదరించే అవకాశాలు తక్కువ. తమిళ.. మలయాళం ప్రేక్షకులకు ఇలాంటి సినిమాలే ఎక్కువగా నచ్చుతారు. వాళ్ళకి మనలా అనవసరమైన అతి ఉంటే నచ్చదు.

 

అందుకు ఉదాహరణగా దృశ్యం సినిమానే చెప్పొచ్చు. మన తెలుగు ప్రేక్షకులకు కంటెంట్ తో పాటు కాస్త కమర్షియల్ టచ్ ఉండాలి. స్లో గా ఉండే సినిమాలకు మంచి టాక్ వస్తే అందరూ బాగుంది అని మెచ్చుకుంటారు కానీ థియేటర్లకు మాత్రం వెళ్లరు. వస్తే టీవీలో చూస్తారు. లేదంటే లేదు. అందుకే మన ఫిలిం మేకర్స్ సినిమా తీసే సమయంలో ఏ సెక్షన్ ఆడియెన్స్ కోసం సినిమా తీస్తున్నామనే విషయంలో క్లారిటీగా ఉంటారు. మరి 'జాను' సినిమాకు టార్గెట్ ఆడియన్స్ ఎవరన్న విషయంలో క్లారిటీ లేదు. తమిళ ఒరిజినల్ దర్శకుడు ప్రేమ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శర్వానంద్.. సమంతసినిమా లో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమిళంలో విజయ్ సేతుపతి - త్రిష చేసిన మ్యాజిక్ ఈ సినిమా లో శర్వానంద్.. సమంత రిపీట్ చేస్తారా అన్నది సినిమా రిలీజైతే గాని తెలీదు. ఇక ఈ సినిమా త్రిషకి కం బ్యాక్ మూవీ అని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: