రవితేజ.. ముద్దుగా అభిమానులంతా మాస్ మహరాజా అనిపిలుచుకుంటారు. ఈ పిలుపుకు తగ్గట్టుగానే, తన మ్యానరిజంతో ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకుని ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న ఈ రవితేజ, గత కొంత కాలం నుండి ఐరెన్ లెగ్ అనే ముద్ర వేసుకున్నాడు.. ఒక విధంగా వరుస ప్లాపులతో సతమతమయ్యాడు.

 

 

ఇలాంటి సమయంలో అతన్ని నిలబెట్టడానికి, మాస్ ప్రేక్షకుల్ని, తన మాస్ డైలాగ్‌లతో దంచికొట్టడానికి, ఈ సారి ప్రత్యేకమైన శ్రద్దతో నిర్మిస్తున్న చిత్రం డిస్కోరాజా.. ఆనంద్ దర్శకత్వంలో, రామ్ తాళ్లూరి తెరకెక్కించిన ఈ చిత్రంలో ఒక పాట టైటిల్ కు తగినట్లుగా మలిచారట. ఇందుకు గాను ఆ పాటకు మూడు నుండి నాలుగు కోట్ల ఖర్చుతో షూట్ చేసారట. ఇంతకు అంత ఖర్చు చేసిన ఆ పాట ప్రత్యేకత ఏంటంటే. ఆ పాట లోని సీన్లు కట్ చేసి, రవితేజ మార్క్ డైలాగులు యాడ్ చేసి ప్రీక్  వీడియో వదిలారు.

 

 

ఇక గత సినిమాలతో చూసుకుంటే ఈ చిత్రంలో రవితేజ స్టయిల్ గా, అందంగా కనిపిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా  ఈ నెల 26న రవితేజ కొత్త నిర్ణయం తీసుకోబుతున్నట్లు సినీవర్గాల సమాచారం.. అదేమంటే ఇప్పటి వరకు రవితేజ హీరోగానే నటిస్తున్నాడు. ఇకపై అయన నిర్మాతగా కూడా మారబోతున్నాడట.

 

 

ఇకపోతే ఇప్పటికే చాలా మంది హీరోలు సినిమాల నిర్మాణంలో భాగస్వామ్యం తీసుకుంటూ నిర్మాతలుగా మారుతున్నారు. కాగా రవితేజ కూడా ఇదే దారిలో నడవనున్నాడని సమాచారం. ఇక ఈ ప్రణాళిక ఎప్పుడు అమలు అవుతుందో, అయన పెట్టె బ్యానర్ పేరేమిటి అన్న విషయాలు తెలియాలంటే కాస్తా అగవలసిందేనట..

 

 

మొత్తానికి సినిమా ఇండస్ట్రీకి మరో కొత్త నిర్మాత ప్రవేశిస్తున్నాడన్న మాట.. ఇకపోతే కిక్కిచ్చే ఎనర్జీతో అభిమానులను అలరించే రవితేజ నటిస్తున్న  డిస్కోరాజా ఈ నెల 24న థియేటర్లలోకి వస్తుంది.. మరి ఈ సినిమా అయినా రవితేజ కోల్పోయిన పూర్వ వైభవాన్ని రప్పిస్తుందేమో చూడాలని అనుకుంటున్నారట..

మరింత సమాచారం తెలుసుకోండి: