సమంత రూత్ ప్రభు గా ఉన్నప్పుడు సమంత చాలా వేరేగా ఉండేది. హీరో ఎన్.టి.ఆర్ అయినా బెల్లంకొండ శ్రీను అయినా తను మాత్రం గ్లామర్ విషయంలో వెనక్కి తగ్గలేదు. కుదిరినంతగా ఎక్స్‌ఫోజింగ్ చేసి ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది. అయితే అది సమంతకి అడిషనల్ మాత్రమే. బేసిగ్గా సమంత మంచి నటి. ఈ విషయం ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. అయితే సమంత అక్కినేని అయ్యాక మాత్రం ఓ బేబి, మజిలీ తరహా సినిమాలకే ప్రాధాన్యం ఇస్తోంది. ఆ సినిమాలతోనే బ్లాక్ బస్టర్ హిట్స్ ని సొంతం చేసుకుంటుంది. ఇక సమంత నటిస్తున్న తాజా చిత్రం జాను త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దిల్ రాజు నిర్మాణంలో తయారవుతున్న ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టైన 96 కి అఫీషియల్ రీమేక్ అన్న విషయం  తెలిసిందే. 

 

సినిమా తర్వాత సమంత సినిమాలేవీ అనౌన్స్ కాలేదు. కానీ ఇంతకుముందు ఎప్పుడూ చేయని పాత్ర చేయాలనుకుంది. అందుకే ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 వెబ్ సిరీస్ లో అవకాశం వచ్చిన వెంటనే ఒప్పేసుకుంది. రాజ్ అండ్ డీకే ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహిస్తున్నారు. సీజన్ 1 మంచి హిట్ అవడంతో సీజన్ 2 ని తీశారు. ఇందులో సమంత జాయిన్ అవ్వడం ప్రధాన ఆకర్షణగా ఉండబోతోంది. సమంత నటించడంతో ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 తెలుగు ఆడియెన్ కి కూడా ఇంకా బాగా కనెక్టవుతుందని టీం ధీమాగా ఉన్నారు. ఇప్పటివరకూ యూత్ కి మాత్రమే కనెక్ట్ అయిన ఈ వెబ్ సిరీస్ ని ఇకపై ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా కనెక్ట్ అవుతుందని నమ్మకంగా ఉన్నారట.

 

ఇక రీసెంట్ గా సమంత పార్ట్ వరకు షూటింగ్ కంప్లీటయిందని సమాచారం. ఈ సందర్భంగా టీమ్ కి సెండాఫ్ చెబుతూ సామ్ ఎంతో ఎమోషన్ అయ్యిందట. ఇంతకుముందెప్పుడూ చేయని కొత్త పాత్రలో నటించానన్న ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బై పోయిందట సమంత. నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చిన రాజ్ అండ్ డీకే లకు కృతజ్ఞతలు...అని తెలిపింది. ఇక ఫ్యామిలీ మ్యాన్ లో నెగిటివ్ రోల్ లో సమంత ఏ రేంజులో ఆకట్టుకుందో చూడాలి. ఇక ఇదిలా ఉంటే సమంత ఇలా నెగిటివ్ రోల్ చేసినందుకు కొంతమంది నెటిజన్స్ మజిలీ వంటి సినిమాలో పెళ్ళైన యువతిగా అలాగే నిజ జీవితంలోను అక్కినేని కోడలిగా ఉన్న మీకు ఇలాంటి రోల్స్ వర్కౌట్ అవుతాయా అంటూ కామెంట్ చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: