పూరి జగన్నాధ్ ఇప్పటి వరకు ఎవరికీ బెండ్ అయి సినిమాలు చేసింది లేదు. ఈ విషయం చాలామందికి తెలిసిందే. ఒక్కసారి స్క్రిప్ట్ ఫైనల్ అయ్యాక హీరో ని సెట్ చేసుకొని సెట్స్ కి వెళ్ళిపోవడమే పూరి స్టైల్. ఒక సినిమాని మొదలు పెట్టారంటే ఎప్పుడు కంప్లీటయింది ..అన్న ఆలోచన వచ్చేస్తుంది. అంత స్పీడ్ గా సినిమాని కంప్లీట్ చేసి రిలీజ్ చేసేస్తారు పూరి. ఇక ఆయన టైటిల్ ఒక్కసారి ఫిక్సైతే ఆయన మాట ఆయనే వినరు. అలాంటిది ఇప్పుడు ఫైటర్ సినిమా విషయంలో అడుగడునా కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుందని తాజా వార్త ఒకటి బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక పూరి చెప్పిన ‘ఫైటర్’ స్క్రిప్ట్ నచ్చి విజయ్ దేవరకొండ ఈ స్క్రిప్ట్‌తో పాన్ ఇండియా సినిమా చెయ్యాల్సిందే అని సలహా ఇచ్చాడట. ఆ సలహా పూరీకి బాగా నచ్చడంతో ఆ తరహాలో ప్రయత్నాలు మొదలు పెట్టారు. 

 

అందులో భాగంగా బాలీవుడ్ కరణ్ జోహార్‌కి ఫైటర్ స్క్రిప్ట్ వినిపించారు. ఆయనకి ఈ స్క్రిప్ట్ బాగా నచ్చి హిందీ, తెలుగులో చేయాలని డిసైడయ్యారు. అయితే ఆ తర్వాత మరో రెండు భాషల్లోను తీయాలని స్క్రిప్ట్ ని పక్కాగా రెడీ చేసుకున్నారు. అంతేకాదు కరణ్ జోహార్ ని ఫైటర్ సినిమాలో భాగస్వామిగాను చేసారు. ఇక పూరి జగన్నాధ్ కి కూడా బాలీవుడ్ స్నేహాతులున్నప్పటికీ.... విజయ్ దేవరకొండ క్రేజ్ తో ఫైటర్ బాలీవుడ్ లో కూడా నిర్మించడం ఇంకా సులభం అయింది. అయితే బాలీవుడ్ టార్గెట్ గా తెరకెక్కుతున్న ఫైటర్ సినిమా విషయంలో మొత్తంగా ఇప్పుడు బాలీవుడ్ పెత్తనమే కనబడుతుందని చెప్పుకుంటున్నారు. పూరి ఎరక్కపోయి ఇరుక్కు పోయాడని సెటైర్లు వేస్తున్నారు.  

 

ఇక సినిమాలో నటించే హీరోయిన్ దగ్గరనుండి... టైటిల్ వరకు ముందు నుండి పూరి జగన్నాధ్ ఫైటర్ స్క్రిప్ట్ రాసుకున్నప్పటినుండి... ఫైటర్ టైటిల్ కి కనెక్ట్ అవడం ఆ టైటిల్ నే ప్రకటించడం జరిగిపోయాయి. అయితే తాజాగా సినిమా ఓపెనింగ్ అయినప్పుడు ఫైటర్ టైటిల్ ని రివీల్ చెయ్యలేదు. అందుకు కారణం అన్ని భాషల్లో ఒకే టైటిల్ ఉండాలని, ఫైటర్ టైటిల్ కరణ్ జోహార్ కి అంతగా నచ్చకపోవడంతో.. మరో టైటిల్ కోసం చూస్తున్నారని అందువల్లనే ఫైటర్ టైటిల్ ని ఎనౌన్స్ చెయ్యలేదని అంటున్నారు. అలాగే ముంబై, గోవాలో జరిగే ఫైటర్ షూటింగ్ చిత్రీకరణను, కరణ్ జోహార్ టీం దగ్గర ఉండి పర్యవేక్షణ చేస్తుందని అంటున్నారు. మరోపక్క కరణ్ జోహార్ ఇన్వాల్మెంట్ తో ఈ సినిమాకి క్రేజ్ వస్తుంది కాబట్టి.. పూరి కూడా కరణ్ ఎలా అంటే అలా అన్నట్లుగా మారిపోతున్నాడనే టాక్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది. అంతేకాదు ఇది పూరి బెండ్ అవుతున్నట్టే అన్న మాట వినిపిస్తోంది. మరి ఇలా బెండ్ అయినా పూరికి ఏమైనా లాభం చేకూరుతుందా అన్నది తెలీదు. అదే ఎప్పటిలాగే తెలుగులో తీసుకుంటే పూరి ఎవరి మాట విననవసరం లేదు కదా ..!  

మరింత సమాచారం తెలుసుకోండి: