మహేశ్ కు పోకిరి సినిమాతో సూపర్ స్టార్ అయ్యాడు. దూకుడుతో ఓవర్సీస్ లో కలెక్షన్ల లెక్కలు మార్చేశాడు. కానీ.. ఈమధ్య మహేశ్ తన రేంజ్ కు తగ్గట్టుగా సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకోవట్లేదని విశ్లేషకుల అభిప్రాయం. మహేశ్ కు ఇంకా మంచి సినిమా పడాలి అనుకునే అభిమానులే ఎక్కువ. రీసెంట్ గా వచ్చిన సరిలేరు.. కూడా కలెక్షన్ల పరంగా మంచి ఫిగర్సే సాధించింది. కానీ.. సినిమాపై దర్శకుడు మొదటినుంచీ పెంచినంత హైప్ అయితే సినిమాలో లేదు. పాటలు కూడా యావరేజ్ గానే మిగిలాయి.

 

 

కథల ఎంపికలో కూడా మహేశ్ జాగ్రత్తలు తీసుకోవటం లేదనేది ఓ వాదన. నిజానికి మహేశ్ చేసినన్ని ప్రయోగాలు ఈ జనరేషన్ లో ఎవరూ చేయలేదు. అలాగని ఒకే మూస కంటెంట్ తో సినిమాలు చేయడం కూడా కరెక్ట్ కాదు. శ్రీమంతుడు తప్పితే హిట్ అయిన భరత్ అనే నేను, మహర్షి సినిమాలు దాదాపు ఒకటే జోనర్ లో ఉన్నాయి. మూడు సినిమాల్లో సీరియస్ కంటెంట్ తప్పితే ఎంటర్ టైన్మెంట్ ఉండదు. సరిలేరు.. సినిమా కూడా మహేశ్ రేంజ్ సినిమా కాదు. సంక్రాంతి సీజన్, మహేశ్ సోలో పెర్ఫార్మెన్సే సినిమాను కాపాడాయి. క్యారెక్టర్ లో వేరియేషన్స్ చూపిస్తున్నాడు కానీ.. కంటెంట్ సెలక్షన్ లో మాత్రం మహేశ్ ఆలోచన మారాల్సిందే.

 

 

సంగీతం పరంగా.. మహేశ్ తో చేసిన ప్రతి సినిమాకు మణిశర్మ డిఫరెంట్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇప్పటికీ అవి క్లాసిక్స్ గా ఉన్నాయి. దేవీశ్రీ ప్రసాద్ మాత్రం శ్రీమంతుడు మినహా మిగిలిన సినిమాలకు రొటీన్ మ్యూజిక్కే ఇచ్చాడు. సరిలేరు.. కు దేవీని వద్దన్న ఫ్యాన్సే ఎక్కువ. కథల ఎంపికలోనూ.. సంగీతం విషయంలోనూ మహేశ్ మేల్కొనకపోతే కష్టమే. బన్నీ అల.. సినిమా సక్సెస్ కు తమన్ అందించిన పాటలే అనేది ఇక్కడ గమనించాల్పిన అంశం.

మరింత సమాచారం తెలుసుకోండి: