మాస్ మహారాజ రవితేజ హీరోగా తెరకెక్కిన తాజా సినిమా డిస్కో రాజా ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని ఎల్లుండి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం వంటి డిఫరెంట్ జానర్ మూవీస్ ని తీసిన విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కథ కూడా ఎంతో వెరైటీ గా ఉంటుందని అంటున్నారు. ఇక కెరీర్ పరంగా రవితేజ కూడా ఇప్పటివరకు ఇటువంటి క్యారెక్టర్ పోషించలేదని, తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని సినిమా యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. నిజానికి రవితేజ ఇటీవల నటిస్తున్న సినిమాలన్నీ కూడా వరుసగా అపజయాలు ఎదుర్కోవడంతో ఆయన ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై ఎన్నో నమ్మకాలు పెట్టుకున్నారు. 

 

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగినప్పటికీ నిర్మాతలు పెట్టిన పెట్టుబడి మేరకు బిజినెస్ రేంజ్ ని అయితే అందుకోలేదని అంటున్నారు. ఓవరాల్ గా సినిమాకు రూ.35 కోట్ల మేర ఖర్చు అయితే, బిజినెస్ మాత్రం రూ.23 కోట్లు మాత్రమే జరిగిందని, వరుసగా రవితేజ ఫ్లాప్స్ ని చవిచూడడంతోనే ఈ సినిమాకు ఇంత తక్కువ స్థాయిలో బిజినెస్ జరిగిందని సమాచారం. అయితే అనుకున్న దానికంటే కూడా ఎక్కువ బడ్జెట్ అయినప్పటికీ కూడా హీరో, దర్శకుల పై నమ్మకంతోనే నిర్మాత రామ్ తాళ్లూరి ఈ సినిమాని ఎంతో గ్రాండ్ గా రూపొందించారని చెప్తున్నారు. 

 

అయితే ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్వహించిన సినిమా యూనిట్, సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని మాత్రం రిలీజ్ చేయలేదు. దానితో సినిమాపై కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో సినిమాకు పబ్లిసిటీ ఎంతో ముఖ్యం అని, ఆ విధంగా చూసుకుంటే టీజర్, ట్రైలర్ అనేవి సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెంచుతాయని, అటువంటిది ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేయలేదంటే, సినిమాలో ఏదో లోపం ఉండి ఉంటుందని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియదు గాని, ఏ మాత్రం తేడా వచ్చినా బయ్యర్లు నెత్తిన చెంగేసుకోవడమే అని అంటున్నారు.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: