`అసుర‌న్` ఈ చిత్రం త‌మిళంలో సూప‌ర్ డూప‌ర్ హిట్ అయిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రం రైట్స్‌ను సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ వాళ్ళు కొన్నారు. దీన్ని తెలుగులో విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా విడుద‌ల‌వుతుంది. ఇక ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత డి. సురేష్‌బాబు నిర్మిస్తున్నారు. శ్రీ‌కాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోతున్న ఈ చిత్రం గురించి తాజా అప్‌డేట్ ఏంటంటే... ఈ రోజు అర్ద‌రాత్రి 12 గంట‌ల‌కు ఈ సినిమా టైటిల్ మ‌రియుర ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేద్దామ‌నుకున్నారు. కానీ ఇందులోని స్టిల్స్ అన్నీ ఎలా లీక్ అయ్యాయో గాని ముందుగానే బ‌య‌ట‌కు వ‌చ్చేశాయి. ఇక ఈ చిత్ర షూటింగ్ అనంత‌పురంలో నెల రోజుల పాటు నిర్విరామంగా జ‌రుగుతుంది. 

 


ఈ చిత్రానికి ‘నారప్ప’అనే టైటిల్ ను ఖ‌రారు చేశారు.  అయితే సురేష్ ప్రొడక్షన్స్ ఇదే టైటిల్ క‌న్‌ప‌ర్మ్  చేశారు. ఇక నటీనటుల విషయానికొస్తే ఇందులో ప్రియమణి కథానాయికగా నటించనుంది. ఈ చిత్రాన్ని మరో ఆరు నెల‌ల వ‌ర‌కు విడుద‌ల చేయాల‌నే ఆలోచ‌న‌లో చిత్ర యూనిట్ ఉందని స‌మాచారం. ఇక ఈ చిత్రం లోని స్టిల్స్ ను చూస్తుంటే వెంక‌టేష్ క‌త్తి ప‌ట్టుకుని ఉన్నారు. ఇందులోని క్యారెక్ట‌ర్ చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉండ‌బోతుంద‌ని ఆ స్టిల్‌ని చూస్తుంటే అర్ద‌మ‌వుతుంది. ఈ ర‌కంగా క‌త్తి ప‌ట్టుకుని భ‌యంక‌రంగా ఉన్న పిక్స్ చూస్తుంటే గ‌తంలో ఆయ‌న న‌టించిన కొన్ని ప‌వ‌ర్ క్యారెక్ట‌ర్స్ అందులో క‌నిపిస్తున్నాయి. మ‌ళ్ళీ ఇన్నేళ్‌ళ  త‌ర్వాత‌ ఆయ‌న క‌త్తి ప‌ట్టార‌నుకుంటా బ‌హుశా అంతే ఆవేశంగా తిరిగి ఇన్నేళ్ళ‌కు మ‌ళ్ళీ ఈ చిత్రం ద్వారా ఆ అవ‌కాశం వ‌చ్చింది. .

 

ఈ మ‌ధ్య వెంకీ చేసే సినిమాల‌న్నీ కూడా దాదాపు మంచి ఫ్యామిలీ స్టోరీస్‌ని మాత్ర‌మే ఎంచుకున్నారు. ఎక్క‌డా కూడా కాస్త కూడా యాక్ష‌న్ అనేది చూపించ‌లేదు. సీత‌మ్మ‌వాకిట్లో చిత్రం, ఎఫ్2, వెంకీమామ ఇలా గ‌త మూడునాలుగేళ్ళ‌బ‌ట్టీ ఆయ‌న న‌టించే చిత్రాల‌న్నీ దాదాపు ఫ్యామిలీ ఎమోష‌న్స్‌ను క్యారీ చేస్తున్న మూవీసే. మ‌రి ఈ చిత్రంలో ఆయ‌న క్యారెక్ట‌ర్ ఎంత భ‌యంక‌రంగా ఉంటుందో ఈ స్టిల్స్‌ని చూస్తుంటే అర్ధ‌మ‌వుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: