టాలీవుడ్ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి గబ్బర్ ఈజ్ బ్యాక్ తో అనే సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ‘మణికర్ణిక: ఝాన్సీ కీ రాణి’ వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జీవితాధారంగా తెరకెక్కించిన సినిమా తో మరోసారి బాలీవుడ్ లో తన సత్తా ఏంటో చూపించుకోవాలనుకున్నాడు. ఇందులో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించారు. అయితే సినిమా షూటింగ్ సమయంలో క్రిష్‌కు కంగనకు మధ్య క్రియేటివ్ డిఫ్రెన్సెస్  వచ్చాయి. ఈ సినిమాలో ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రకు కొన్ని అడిషనల్ అట్రాక్షన్స్ ఇవ్వాలని కంగన క్రిష్‌కు చెప్పారు. కానీ ఇందుకు క్రిష్ ఒప్పుకోలేదట. ఉన్నది ఉన్నట్టుగానే తీయాలని క్రిష్ అన్నాడట.

 

దాంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ఇలాగైతే నేను సినిమా చేయనని చెప్పి క్రిష్ నిర్మొహమాటంగా తప్పుకున్నారు. దాంతో దర్శకత్వ బాధ్యతలను కంగన తీసుకున్నారు. బ్యాలెన్స్ షూటింగ్ పార్ట్ ని కంగన కంప్లీట్ చేశారు. అయితే ఈ విషయంలో కంగన ప్రవర్తనపై చాలా మంది మండిపడ్డారు. దీని గురించి తాజాగా కంగన స్పందిస్తూ ‘‘క్రిష్ సినిమా నుంచి తప్పుకున్నారు. దాంతో నేను దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నాను. ఆ రకంగా నేను సినిమాకు, నిర్మాతలకు న్యాయం చేస్తే నన్ను మెచ్చుకోవాల్సిందిపోయి నోటికొచ్చినట్లు తిట్టారు. దాంతో నేను షాకయ్యాను. సెట్‌లో నటుడిగా ఉండటం గౌరవనీయమైన ఉద్యోగం అనుకోవాలి. ఎందుకంటే మన ఇండియాలో నటీనటులకు ఉండే విలువ డైరెక్టర్లకు ఉండదు’’ అని వెల్లడించారు కంగన.

 

అయితే కంగన చేసిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని ఏడాది క్రితం క్రిష్ క్లారిటీ ఇచ్చారు. ‘మణికర్ణిక’ సినిమాలో మరాఠా వీరుడు సదాశివరావు పాత్ర కోసం సోనూ సూద్‌ను ఎంపిక చేసుకున్నారు. కానీ సెట్‌లో కంగన నటిగా కాకుండా డైరెక్టర్‌గా వ్యవహరించడం నటుడు సోనూ సూద్‌కు నచ్చలేదు. అంతేకాకుండా చరిత్రలో ఝాన్సీ లక్ష్మీబాయి గురించి ఉన్నది ఉన్నట్లు సినిమాలో చూపించకుండా సొంతంగా కంగన మార్పులు చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో క్రిష్ ఇంకెప్పుడూ కంగనతో కలిసి పనిచేయనని తేల్చి చెప్పేశారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: