ప్రముఖ తెలుగు టెలివిజన్ ఛానల్ ఈటీవీలో కొన్నేళ్ల నుండి ప్రసారం అవుతున్న జబర్దస్త్ షో గురించి తెలియని మన తెలుగు వారు దాదాపుగా ఉండరు అనే చెప్పాలి. నిజానికి ఆ షో ప్రారంభం అయిన తరువాత నుండి ఈటివి యొక్క పేరు, రేటింగ్స్ మరింతగా పెరిగాయనేది వాస్తవం. అంతలా ఆ షో ప్రేక్షకుల్లోకి చొచ్చుకుపోవడంతో పాటు ఎక్కువమంది ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించే షోగా పేరు తెచ్చుకుంది. ఇక ఆ షోకు జడ్జీగా వ్యవహరిస్తున్న మెగాబ్రదర్ నాగబాబు ఇటీవల కొన్ని కారణాల వలన షో నుండి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. 

 

కిరాక్ ఆర్పీ, చమ్మక్ చంద్ర వంటి వారు కూడా నాగబాబుతో పాటు బయటకు వచ్చారు. అయితే నాగబాబు తో కలిసి వారందరూ ఇటీవల జీ తెలుగులో ప్రసారం అయిన అదిరింది షోలో పాల్గొనడం జరిగింది. ఇక ఆ షోకు కూడా నాగబాబు జడ్జీగానే ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. అయితే మంచి క్రేజ్, పబ్లిసిటీ తో అదరగొట్టిన ఆ షోకు ఆశించిన రేంజ్ లో అయితే రేటింగ్స్ రావడం లేదని సమాచారం. నిజానికి గతంతో పోలిస్తే ప్రస్తుతం షోకు మెల్లగా ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నరని అంటున్నప్పటికీ కూడా అది నామమాత్రమే అని సమాచారం. అయితే జబర్దస్త్ మాదిరిగా అదిరింది షో పెద్దగా సక్సెస్ కాలేకపోవడానికి గల పలు కారణాల్లో ఒక ముఖ్య కారణం ఇదేనంటున్నారు పలువురు విశ్లేషకులు. 

 

ఇక వారు చెప్తున్న దానిని బట్టి, జబర్దస్త్ షోలో పార్టిసిపెంట్స్ చేసే స్కిట్స్ లో హ్యూమర్ ఎక్కువగా ఉండడంతో పాటు స్కిట్స్ లో కొత్తదనం ఉంటోందని, అదే అదిరింది షోని కనుక పరిశీలిస్తే, అవి ఎక్కువగా రొటీన్ గా ఉండడంతో పాటు, హ్యూమర్ జనరేట్ అయ్యే అంశాలు ఎక్కువగా లేకపోవడం, అలానే కొత్తదనం ఏమి లేకుండా జబర్దస్త్ నే అనుకరిస్తున్న మాదిరిగా స్కిట్స్ ఉంటున్నాయని చెప్తున్నారు. ఇక కొద్దిరోజులుగా అదిరింది షోను మరింతగా ప్రజలకు చేరువ చేసేందుకు నాగబాబు సహా మిగతా షోలోని టీమ్ మొత్తం కూడా ఎంతో శ్రమిస్తోందని, ఇక రాబోయే రోజుల్లో షో మరింత ఆసక్తికరంగా సాగుతుందని సమాచారం. అదే కనుక నిజం అయితే ఇక జబర్దస్త్ కు అదిరింది మంచి పోటీ ఇవ్వడం ఖాయం అనే అనాలి...!! 

మరింత సమాచారం తెలుసుకోండి: