జనసేన పార్టీ వ్యవస్థాపకుడు గా 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా చంద్రబాబుతో- బీజేపీతో కలసి ఎన్నికల ప్రచారంలో పాల్గొని చంద్రబాబుకి మద్దతు తెలిపారు పవన్ కళ్యాణ్. ఆ సమయంలో జరిగిన ఎన్నికలలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. అయితే జనసేన పార్టీ స్థాపించి ఏడు సంవత్సరాలు కావస్తున్నా గాని ఇప్పటివరకు పొత్తులతో రాజకీయ కెరీర్ ని నెట్టుకొచ్చిన పవన్ కళ్యాణ్ ఎక్కువగా ప్రజా సమస్యల కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్ ని టార్గెట్ చేయడానికి, విమర్శించడానికి, శప్పించడానికి తన పొలిటికల్ కెరియర్ లో ఎక్కువ టైం కేటాయించడం జరిగింది.

 

అయితే 2019 ఎన్నికల్లో మొట్టమొదటి సారి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ రెండు చోట్ల దారుణంగా చిత్తు చిత్తుగా ఓడిపోవడం జరిగింది. దీంతో ఆ దెబ్బతో పవన్ కళ్యాణ్ ఇంక రాజకీయాలకు ప్యాకప్ చెప్పి సినిమా కి మేకప్ వేసుకోవడానికి వెళ్ళిపోతారు అంటూ రాజకీయ ప్రత్యర్ధులు కామెంట్ చేయడం తో నా జన్మలో ఇంకా సినిమాలు చేయను నా చివరి కట్టె కాలే వరకు ప్రజా సమస్యలపై పోరాడుతా అంటూ తెగ డైలాగులు కొట్టిన పవన్ కళ్యాణ్ ఇటీవల బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకుని మరోపక్క సినిమాలు చేసుకోవడానికి రెడీ అయిపోయారు.

 

ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బాలీవుడ్ ‘పింక్’ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ మొదలయ్యే వారం రోజులు గడవక ముందే మరో సినిమాకి పవన్ కళ్యాణ్ రెడీ అయినట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి. మేటర్ లోకి వెళ్తే క్రిష్ దర్శకత్వంలో ఓ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా చేయడానికి పవన్ కళ్యాణ్ రెడీ అయినట్లు స్టోరీ మొత్తం అంతా ఓకే అయినట్లు ఆ సినిమా జనవరి 27 వ తారీఖున మొదలు కానున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: