సంక్రాంతి రేస్ విన్నర్ గా అల్లు అర్జున్ విజయం సాధించడంతో బన్నీ మంచి జోష్ లో ఉన్నాడు. బన్నీ కలలు కన్న 100 కోట్ల నెట్ కలక్షన్స్ ను ‘అల వైకుంఠపురములో’ అతడికి అందించడమే కాకుండా ఇప్పటి వరకు ఓవర్సీస్ ప్రిన్స్ గా కొనసాగుతున్న మహేష్ మ్యానియాకు బన్నీ చెక్ పెట్టాడు. 

ఇలాంటి పరిస్థితులలో ప్రస్తుతం ఎక్కడ చూసినా బన్నీ మ్యానియా కనిపిస్తోంది. దీనితో మరింత రెట్టించిన ఉత్సాహంతో త్వరలో ప్రారంభం కాబోతున్న సుకుమార్ మూవీ షూటింగ్ కు బన్నీ రెడీ అవుతున్నాడు. ఈ జోష్ ఇలా కొనసాగుతూ ఉంటే వివాదాల రామ్ గోపాల వర్మ నిన్న అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపిస్తూ పెట్టిన ట్విట్ చూసి హడలి పోతున్నట్లు టాక్. 

తాను జీవించి ఉన్నంత వరకు చిరంజీవి వీరాభిమానిగా కొనసాగుతాను అని ఓపెన్ గా అల్లు అర్జున్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వర్మ ట్విట్ తో మళ్ళీ బన్నీ పై మెగా అభిమానులలో అసహనం మొదలైంది. ‘అల వైకుంఠపురములో’ మూవీ సక్సస్ అయినందుకు బన్నీని అభినందిస్తూ వర్మ ‘వెటరన్ కమెడియన్ అల్లు రామలింగయ్యకు సిసలైన నట వారసుడిగా సూపర్ స్టార్ - మెగాస్ ని అల్లు అర్జున్ అధిగమించాడు’ అంటూ వర్మ ట్విట్ చేసాడు. 

ఇప్పుడు ఈట్విట్ మహేష్ మరియు మెగా అభిమానుల దృష్టి వరకు రావడంతో కేవలం ఒకే ఒక్క మూవీ హిట్ తో బన్నీకి అంత రేంజ్ ఏర్పడిందా అంటూ కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు మరి కొందరు మెగా అభిమానులు అయితే రామ్ గోపాల్ వర్మ పొగడ్తలకు కృతజ్ఞతగా బన్నీని వర్మ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించి ఋణం తీర్చుకోమని సలహాలు కూడ ఇస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ తన పై లేటెస్ట్ గా మొదలైన ఈ నెగిటివ్ కామెంట్స్ దాడి చూసి బన్నీ వర్మ అనవసరంగా తన పై పొగడ్తలు కురిపించి ఎందుకు మళ్ళీ తనను మెగా అభిమానులకు శత్రువుగా మారుస్తున్నాడు అంటూ తల పట్టుకుంటున్నట్లు టాక్.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: