టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో సంక్రాంతి ముందు విడుదలైన సినిమా అలా వైకుంఠపురములో. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే నటించింది. మొదటినుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది ఈ సినిమా. ఈ సినిమాకు సంబంధించిన పాటలు అయితే యూట్యూబ్ ని షేక్  చేసి సంచలన రికార్డులు  సైతం నమోదు చేశాయి . జనవరి 12న సంక్రాంతి ముందు విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ సంచలన విజయాన్ని నమోదు చేసింది అలా వైకుంఠపురములో సినిమా. ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లో కూడా రికార్డు స్థాయిలో వసూళ్లను రాబడుతుంది. కాగా  బన్నీ కెరీర్లోనే బ్లాక్ బస్టర్ వసూళ్లు రాబట్టింది అల వైకుంఠ పురములో సినిమా. ఇక ఈ సినిమా బ్లాక్బస్టర్ హిట్ అవ్వడానికి ముఖ్య కారణం ఈ సినిమాలోని సంగీతం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 

 

 

 అల్లు అర్జున్ త్రివిక్రమ్ కూడా ఈ విషయాన్ని ఒప్పుకొని సినిమా సక్సెస్ క్రెడిట్ మొత్తం తమిన్  కి ఇచ్చేసిన  విషయం తెలిసిందే. ఇప్పటికే అలా వైకుంఠపురములో  సినిమా కోసం సంగీత దర్శకుడు తమన్ సమకూర్చిన స్వరాలపై ఎంతోమంది ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా ఈ సినిమాలో తమన్ కంపోజ్ చేసిన సామజవరగమనా పాట ఎవర్గ్రీన్ గా నిలిచింది. ఇక తాజాగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు అయిన కేటిఆర్ కూడా సామజవరగమనా పాట పై ప్రశంసలు కురిపించారు. తమన్ నిన్ను నువ్వే మించి పోయావు అంటూ అభినందించారు మంత్రి కేటీఆర్. కేటీఆర్ ప్రశంసలకు తమను కృతజ్ఞతలు కూడా చెప్పడం జరిగింది. 

 

 

 అయితే వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్లు వైరల్ అయ్యాయి.  ఇకపోతే బన్నీ అభిమానులందరూ కేటిఆర్ కు   ట్విట్టర్ వేదికగా కొన్ని రిక్వెస్ట్ లని  పంపుతున్నారు. ఇంతకీ ఆ రిక్వెస్ట్ ఏంటి అంటారా... సినిమాలోని పాటలే  కాదు సినిమా కూడా అద్భుతంగా ఉంటుందని  ఒకసారి చూడండి సార్ అంటూ రిక్వెస్ట్  చేస్తున్నారు బన్నీ ఫాన్స్ . మరి అల్లు అర్జున్ ఫాన్స్ రిక్వెస్ట్ ని మంత్రి కేటీఆర్ పరిగణలోకి తీసుకొని అలా  వైకుంఠపురములో సినిమా ను చూస్తారా లేదా చూడాలి మరి. ఇకపోతే ఇప్పటికే సంచలన వసూళ్ళు రాబడుతున్న ఈ సినిమా  సినిమా... ఇంకా  ఆ వసూల్లా  జోరును కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికే వంద కోట్ల క్లబ్లో చేరగా..  అలా వైకుంఠపురములో సినిమా ఇంకెన్ని  వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టిస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: