వెంకీ మామ సినిమాతో యావరేజ్ హిట్ సాధించిన విక్టరీ వెంకటేష్ తన తర్వాతి చిత్రంగా తమిళంలో ఘనవిజయం సాధించిన అసురన్ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. వెట్రిమారన్ దర్శకత్వం వహించిన అసురన్ సినిమాలో తమిళ నటుడు ధనుష్ హీరోగా నటించాడు. ఈ సినిమా అక్కడి జనాలకి బాగా నచ్చింది. దాంతో సురేష్ బాబు ఈ సినిమా రీమేక్  హక్కులని కొనుక్కుని వెంకటేష్ తో నిర్మించ తలపెట్టాడు.

 

 

బ్రహ్మోత్సవం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి ఫ్యామిలీ డ్రామాలు తీసిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే కాగా తాజాగా ఈ సినిమా నుండి ఒక అప్డేట్ బయటకి వచ్చింది. అసురన్ తెలుగు తెలుగు టైటిల్ ని అంతకుముందు ప్రచారంలో ఉన్నట్టుగానే "నారప్ప" అనే పేరును కన్ఫర్మ్ చేశారు. ఈ మేరకు నారప్పగా వెంకటేష్ ఫస్ట్ లుక్ ని విడుదల చేసిందీ చిత్ర బృందం.

 

మధ్య వయస్కుడి పాత్రలో వెంకటేష్ చాలా చక్కగా ఉన్నాడు. నారప్పగా అతడి మొహంలో గాంభీర్యం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. రిలీజ్ చేసిన పోస్టర్లు చూస్తుంటే ఈ సినిమాలో వెంకీ పర్ ఫార్మెన్స్ అదిపోయేలా ఉంటుందని అనిపిస్తుంది. నాలుగు పోస్టర్లలోనూ విభిన్నత కనిపిస్తోంది. వెంకటేష్ ఇంటెన్సివ్ లుక్ లో, గెటప్ లో చాలా చక్కగా ఒదిగిపోయాడు. సినిమాలో ఎక్కువ భాగం అనంతపురంలో జరగనుంది.

 

 

అలాగే ఈ సినిమాలో వెంకటేష్ పక్కన నటించే వాళ్లలో ఎక్కువ మంది కొత్తవాళ్ళే కనిపించనున్నారట. పల్లెటూరి వాతావరణంలో జరిగే కథ కాబట్టి కొత్త వాళ్ళుంటేనే బాగుంటుందని భావిస్తున్నారట. ఇక వెంకటేష్ సరసన హీరోయిన్ గా ప్రియమణి ఫిక్స్ అయింది. మరి నారప్ప అనుకున్న అంచనాలని అందుకుంటాడా లేదా చూడాలి. చిత్రాన్ని 2020 మొదటి సగంలోనే రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు సురేష్ బాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: