రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. బాహుబలి తర్వాత రాజమౌళి నుండి వస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. జూనియర్ ఎన్టిఆర్ మరియు రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. అజయ్ దేవగణ్ నిన్ననే షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఈ మేరకు రాజమౌళి టీమ్ ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు.

 

ఇప్పటికే డెభ్భై ఐదు శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుందని సమాచారం. కొమరం భీం గా ఎన్టీఆర్ నిజాం ప్రభువుని ఎదిరించిన సన్నివేశాలని ఆల్రెడీ తెరకెక్కించారట. ఇకపోతే రామ్ చరణ్ ఆంగ్లేయులతో పోరాడిన సన్నివేశాలని తెరకెక్కించారా లేదా అన్నది తెలియదు. అయితే ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీని జులై 30 వ తేదీగా ఇంతకుముందే ప్రకటించారు.

 

కానీ అనుకున్న ప్రకారం ఈ తేదీన సినిమా విడుదల అవడమన్నది కష్టంగా అనిపిస్తోంది. సాధారణంగా రాజమౌళి తన సినిమాలని ఆలస్యంగా తెరకెక్కిస్తుంటాడు. ప్రతీ దానిలో ఖచ్చితత్వాన్ని పాటించే రాజమౌళి సినిమాని శిల్పంలా చెక్కుతాడు కాబట్టి ఆలస్యం అవుతుంటాయి. అయితే ఈ సినిమా కూడా ఆలస్యం అయ్యేలా ఉందని అంటున్నారు. సినిమా మరింత ఆలస్యం అయితే ఎప్పుడు విడుదల అవుతుందనే ప్రశ్న మొదలైంది.

 


ఆర్ ఆర్ ఆర్ లాంటి పెద్ద సినిమా రిలీజ్ అవ్వాలంటే సోలో రిలీజ్ ఉండాల్సిందే. ఈ సినిమాతో పాటు ఏ సినిమా ఎదురెళ్ళినా వేరే సినిమాకి నష్టం రావడంతో పాటు ఆర్.ఆర్.ఆర్ కి కూడా దెబ్బ పడుతుంది. మరి జులైలో సినిమా రాకుంటే దసరాకి వస్తుందేమో అని అనుకుంటున్నారు. ఒకవేళ దసరాకి కూడా కుదరకపోతే సంక్రాంతి విడుదల అవుతుందేమోనని అనుకుంటున్నారు. ఇలాంటి ఊహల మధ్య రామ్ చరణ్సినిమా అనుకున్న సమయానికి విడుదల అవుతుందని ఖచ్చితంగా చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: