మెగా స్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ను ఒక మంచి డాక్టర్ గా కాని లేదంటే ఒక మంచి ప్రొఫెసర్ గా కాని చూడాలని ఆశలు పెట్టుకున్నాడు. అయితే పవన్ కు చదువు అంతగా రాకపోవడంతో సినిమా హీరోగా మారి ఆతరువాత రాజకీయ నాయకుడుగా మారిపోయాడు. 

ఆ తరువాత చిరంజీవి తన కొడుకు రామ్ చరణ్ కూడ విదేశాలలో ఉన్నత విద్యలు అభ్యసిస్తే ముచ్చట పడాలని భావించాడు. అయితే చరణ్ కూడ తన బాబాయ్ పవన్ లానే చదువు పై పెద్ద దృష్టి పెట్టకుండా ఇప్పుడు టాప్ హీరోల జాబితాలో ఒకడుగా కొనసాగుతున్నాడు. చిరంజీవి కన్న కలలను ఆయన కోడలు ఉపాసన నేరవేరుస్తోంది. 

ఇప్పటికే అపోలో హాస్పటల్స్ కు సంబంధించిన అపోలో లైఫ్ కు డైరెక్టర్ గా కొనసాగుతున్న ఉపాసన తనలోని బిజినెస్ నైపుణ్యాన్ని మరింత పెంపొందించు కోవడానికి ఉపాసన అమెరికాలోని బోస్టన్ లో ఉన్న హార్వర్డ్ బిజినెస్ స్కూల్ లో ఒక షార్ట్ టర్మ్ కోర్స్ చేయడానికి ఈమధ్యనే అమెరికాకు చరణ్ తో కలిసివెళ్ళి అక్కడ జాయిన్ అయింది. ప్రస్తుతం ఈ వార్తను చరణ్ తన అభిమానులతో షేర్ చేసుకుంటూ తాను ఉపాసనతో కలిసి ప్రస్తుతం అమెరికాలో ఉన్నానని త్వరలో తిరిగి వచ్చి ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ లో జాయిన్ అవుతాను అంటూ ట్విట్ చేసాడు. 

దీనితో ఉపాసన చిరంజీవి కలలను తీర్చే దిశగా అడుగులు వేస్తోంది అయితే మెగా అభిమానులతో పాటు చిరంజీవి కూడ చరణ్ వారసుడు గురించి ఎదురు చూస్తున్న పరిస్థితులలో చిరంజీవికి మిగిలి ఉన్న ఆ ఒక్క కోరికను కూడ ఉపాసన ఎప్పుడు తీరుస్తుందో చూడాలి. దీనితో పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ లు చిరంజీవి విషయంలో నెరవేర్చలేని కలను నెరవేర్చి మెగా కోడలు తన మెగా మామ కు మంచి గిఫ్ట్ ఇచ్చింది అనుకోవాలి..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: