టాలీవుడ్ లో తనదైన కామెడీ సినిమాలతో అలరిస్తూ అందరి మనసు దోచేస్తున్న దర్శకులు అనీల్ రావిపూడి ఈ ఏడాది మహేష్ బాబు, రష్మిక మందనతో తెరకెక్కించిన ‘సరిలేరు నీకెవ్వరు’ తో మరో ఘన విజయం అందుకున్నారు.  ఈ మూవీలో దాదాపు పదమూడేళ్ల తర్వాత లేడీ అమితాబ్ విజయశాంతి నటించింది.  ఆమెను నటించపజేయడానికి అనీల్ రావిపూడి చాలా తంటాలు పడ్డానని ఇటీవల పలు ఇంటర్వ్యూల్లో తెలిపారు.  ఇక అనీల్ రావిపూడి తీసిన ఐదు సినిమాల్లో ఒక్క పటాస్ మినహా మిగతా అన్ని మూవీస్ లో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ ని తీసుకున్నారు.  వాస్తవానికి వీరిద్దరి కాంబినేషన్ కూడా బాగానే వర్క్ ఔట్ అయ్యింది. 

 

తాజాగా సరిలేరు నీకెవ్వరు మూవీలో మహేష్ పక్కన తనదైన కామెడీ మార్క్ చాటుకున్నారు రాజేంద్ర ప్రసాద్.  ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో  తన సినిమాల్లో వరుసగా రాజేంద్ర ప్రసాద్ ను తీసుకోవడానికి గల కారణాల గురించి దర్శకుడు అనిల్ రావిపూడి ఇటివలే అలితో సరదాగా అనే కార్యక్రమంలో చెప్పుకొచ్చారు. “ముందు నుంచి రాజేంద్రప్రసాద్ గారికి నేను పెద్ద ఫ్యాన్ ని. ఆయన సినిమాలను వదలకుండా చూసేవాడిని. బెసిగ్గా నేను కామెడీ అంటే చాలా ఇష్టపడతాను.. తెలుగు లో కామెడీ హీరోగా రాజేంద్ర ప్రసాద్ మూవీస్ ఎన్నో చూసేవాడిని.. అందుకే ఆయన అంటే చిన్నప్పటి నుంచి ఎంతో అభిమానం అని అన్నారు. 

 

రాజేంద్ర ప్రసాద్ అప్పట్లో తెరపై కనిపిస్తే చాలు కడుపుబ్బా నవ్వుకునేవారు.. అంత గొప్ప కామెడీ సినిమాల్లో ఆయన నటించి మెప్పించారు. తాను సినీ పరిశ్రమలోకి రాగానే రాజేంద్ర ప్రసాద్ ని కలుసుకున్నానని అన్నారు. ఆయన ఎక్కడ కనిపించినా ఆయన పట్ల గల అభిమానాన్ని చాటుకోవాలని అనుకునేవాడిని. నేను దర్శకుడిని అయిన తర్వాత ఆయనతో కలిసి పనిచేసే ఛాన్స్.. అదృష్టం లభించింది.  ఏది ఏమైనా రాజేంద్ర ప్రసాద్ పై ఉన్న గౌరవం అనీల్ రావిపూడి తన సినిమాల ద్వారా తీర్చుకుంటున్నారని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: