మాస్ మహారాజ రవితేజ హిరోగా విభిన్న చిత్రాల దర్శకుడు వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డిస్కో రాజా.. రవితేజ ఇమేజ్ కి తగ్గట్టుగానే టైటిల్ ని ఎంచుకున్న దర్శకుడు మరి రవితేజ తో ఎలాంటి పర్ ఫార్మెన్స్ చేయిస్తాడనేది సందేహంగా ఉంది. అసలు రవితేజ లాంటి మాస్ హీరో తో థ్రిల్లర్ చిత్రాల దర్శకుడయిన వీఐ ఆనంద్ వర్క్ చేయడం ఏంటని అందరూ ఆశ్చర్యపోయారు. కానీ కథా పరంగా ఆ సినిమా రవితేజ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాని మొదలెట్టారట.

 

ఈ సినిమాలో బాబీ సింహా విలన్ గా కనిపించనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో అతనిది ప్రత్యేకమైన పాత్ర అని తెలుస్తుంది. రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ మరియు నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ఈ నెల ౨౪ వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పటికీ థియేటర్ల వద్ద సంక్రాంతి సినిమాల సందడి కొనసాగుతూనే ఉంది. ఇంకా సినిమా టికెట్లు దొరక్క క్యూ కడుతూనే ఉన్నారు.

 

ఇలాంటి టైమ్ లో డిస్కో రాజా రిలీజ్ అవడం పెద్ద సాహసమే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డిస్కో రాజా నిలబడాలంటే పాజిటివ్ టాక్ రావడమే కాకుండా ఓపెనింగ్స్ కూడా బాగుండాలి.  34 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం రవితేజ కెరీర్‌లో అత్యధికమైన బడ్జెట్ తో నిర్మించారు. మరి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలవాలంటే ఘనమైన ఓపెనింగ్స్ ను సాధించాల్సి ఉంది. చాలా రోజుల తర్వాత రవితేజ సినిమా మంచి పాజిటివ్ బజ్ తో రిలీజ్ అవుతుంది. 

 

కాబట్టి ఓపెనింగ్స్ పరంగా ఎలాంటి ప్రమాదం ఉండదని భావిస్తున్నారు. మరి డిస్కో రాజా ఎలాంటి మాయ చేస్తాడో చూడాలి. ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ చిత్రానికి థమన్ సంగీతం అందించగా, అబ్బూరి రవి మాటలు అందించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: