సౌత్ ఇండియా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మలయాళ 'ప్రేమమ్' చిత్రం తరువాత ఎంత క్రేజ్ ని సంపాదించినదో చెప్పనక్కర్లేదు. ఈ చిత్రం తర్వాత తెలుగు ఇండస్ట్రీలో కూడా ఆమెకు ఎన్నో సినీ అవకాశాలు వచ్చాయి. దీంతో ఆమె కొన్ని తెలుగు సినిమాల్లో నటించి ముఖ్యంగా శతమానం భవతిలో హీరో శర్వానంద్ కు జతకట్టి తెలుగు ప్రేక్షక అభిమానుల మనసుల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది.  ఇదిలా ఉంటే ఒకవైపు ఆమె సినిమాల్లో నటిస్తూ.. మరోవైపు తన చదువుని కొనసాగిస్తోంది. ఈ మధ్యే ఆమె CMS కళాశాల కొట్టాయంలో చేరి డిగ్రీ విద్యను అభ్యసించడం ప్రారంభించింది.

 

 

ఈ క్రమంలోనే.. ఆమెకు సంబంధించిన ఒక ఫోటో బీహార్ రాష్ట్రంలో నిర్వహించే సెకండరీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ హాల్ టికెట్ లో దర్శనమిచ్చింది. దీంతో అనుపమ టీచరమ్మ అవుతుందా?  అని నెట్టింట అభిమానులు తెగ చర్చించు కుంటున్నారు. కానీ దీంట్లో ఎంత మాత్రం నిజం లేదని తెలిసింది.  అసలు విషయానికి వస్తే.. సెకండరీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కొరకై దరఖాస్తు చేసిన అభ్యర్థుల కోసం బీహార్ బోర్డు హాల్ టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. అయితే, మక్దుంపుర్‌‌లో నివశించే రిషికేశ్ కుమార్ డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్ లో అనుపమ పరమేశ్వర్ ఫోటో వచ్చింది.

 

 

దీంతో రిషికేశ్ ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. వెంటనే హాల్ టికెట్ లో ఉన్న సమాచారాన్ని పరిశీలించగా.. అందులో అతనికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి కానీ అతని ఫోటో స్థానంలో మాత్రం అనుపమ పరమేశ్వరన్ ఫోటో ఉంది. దీంతో ఆందోళనకు గురైన సదరు అభ్యర్థి ఈ విషయాన్ని బీహార్ బోర్డు దృష్టికి తీసుకెళ్లగా... ప్రస్తుతం అధికారులు దిద్దుబాటు చర్యలను చేపట్టారు.

 

 

గతంలో కూడా బీహార్ రాష్ట్రంలో జరిగిన ఇంజనీరింగ్ అసిస్టెంట్ జాబ్ పోస్ట్ పరీక్ష రిజల్ట్ కార్డులో సన్నిలియోన్ ఫోటో ప్రత్యక్షమై సంచలనం సృష్టించింది.  ఇక ఇలాంటి పొరపాట్లు అధికారులకు కామనే కావచ్చు గాని చూసేవారికి మాత్రం దిమ్మతిరుగుతుందట.. ఎందుకంటే తమ అభిమాన హీరో, హీరోయిన్స్‌కు సంబంధిన విషయాలంటే చెవి కోసుకునే అభిమానులున్న మనదేశంలో వారి గురించిన చిన్న విషయం కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇదిగో ఇప్పుడు అనుపమ విషయం కూడా ఇలాగే చక్కర్లు కొడుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: