మాట‌ల‌మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌, అల్లుఅర్జున్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన చిత్రం `అల‌వైకుంఠ‌పురంలో` ఈచిత్రం మొద‌టిరోజు నుంచి కూడా మంచి క‌లెక్ష‌న్ల‌తో బాక్సాఫీస్ ముందు దూసుకెళుతుంది. ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఓ రేంజ్‌లో క‌లెక్ష‌న్ల‌ను తెచ్చుకుంది. మొత్తానికి మంచి లాభాల్లోనే ఈ చిత్రం న‌డుస్తుంది.

 

అయితే అస‌లు చిక్కంతా ఎక్క‌డుందంటే... ఈ చిత్రం లాభాల్లో న‌డుస్తున్న‌ప్ప‌టికీ ఇందులో న‌టించిన కొంత మంది న‌టీన‌ట‌లుకు ఇప్ప‌టివ‌ర‌కు స‌రిగా పేమెంట్లు అంద‌లేద‌ని సమాచారం. ముఖ్యంగా ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లో న‌టించిన ముర‌ళీ శ‌ర్మ డైలీపేమెంట్ తీసుకున్నాడ‌ని ముందు మాట్లాడుకున్న‌ప్ర‌కార‌మే కాల్‌షీట్‌ ఇచ్చాడ‌న్న‌వాద‌న‌లు వినిపిస్తున్నాయి. 

 

అనుకోకుండా అనుకున్న దానికంటే త‌న కాల్‌షీట్స్ ఎక్కువ రోజులు పెంచాల్సి వ‌చ్చింది. ఇద్ద‌రూ పెద్ద నిర్మాత‌లే కాబ‌ట్టి త‌న డ‌బ్బుకు ఢోకా ఉండ‌ద‌న్న ఉద్దేశంతో ఏమీ మాట్లాడ‌కుండా షూటింగ్ మొత్తం పూర్తిచేసుకెళ్ళాడు. కానీ మిగిలిన ఎక్స్‌ట్రా డేస్ చేసినందుకు మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు డ‌బ్బులు అంద‌లేద‌ని స‌మాచారం. 

 

దీంతో ముర‌ళీ శ‌ర్మ కాస్త మ‌న‌సు నొచ్చుకోవ‌డంతో అల‌వైకుంఠ‌పురం ప్ర‌మోషన్స్, ఈవెంట్స్ అన్నిటికి దూరంగా ఉంటూ. ఇంత బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన సినిమా, పైగా ఇంత పెద్ద పేర్లున్న సంస్థ‌లు ఇలాంటి టాక్ రావ‌డ‌మేంటో అర్ధం కావ‌డం లేదు. పైగా గ‌తంలో ఎప్పుడూ కూడా గీతా ఆర్ట్స్ పైన ఇలాంటి అప‌వాదాలు విన్న‌ది లేదు.  ఇక ఈ చిత్రానికి మ్యూజిక్ త‌మ‌న్ అందించ‌గా మంచి హిట్ సాధించిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో సూప‌ర్ హిట్ అయింది. త్రివిక్ర‌మ్ మంచి ఫ్యామిలీ ఎమోష‌న్స్‌తో తెర‌కెక్కించాడు. ఇక ముర‌ళీ శ‌ర్మ ఏ పాత్ర‌నైనా అవ‌లీల‌గా పోషిస్తార‌న్న విష‌యం తెలిసిందే నెగిటివ్ అయినా పాజిటివ్ పాత్ర‌నైనా దేన్నైనా స‌రే పాత్ర‌లో లీన‌మ‌యి అద్భుత‌మైన న‌ట‌న‌ను క‌న‌బ‌రుస్తారు. ఒక్కో పాత్ర‌కి ఒక్కో వేరియేష‌న్ చూపిస్తూ ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త పాత్ర‌ల‌ను ఎంచుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: