క్రేజీ హీరో విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న 'ఫైటర్'. మూవీకి ఆ ప్రారంభం అయిన రోజునే ఊహించని షాక్ తగిలింది అన్న వార్తలు వస్తున్నాయి.  మొదట ‘ఫైటర్' ను తెలుగులో మాత్రమే  తీయాలని భావించారు. అయితే  ఈ మూవీకి కరణ్ జోహార్ కూడ కలిసి రావడంతో ఈమూవీని పాన్ ఇండియా మూవీగా మార్చి భారీ బడ్జెట్ తో తీస్తున్నారు.   

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరికొత్త లుక్‌ తో  కనిపించడమే కాకుండా ఈ మూవీలో విజయ్ మార్షల్ ఆర్ట్స్ తెలిసిన వ్యక్తిగా కనిపించబోతున్నాడు. అందుకోసం కొద్ది రోజులుగా విజయ్ థాయ్‌లాండ్‌ కు చెందిన పదిహేను మంది ఫైటర్ల నుంచి మార్షల్ ఆర్ట్స్‌లో మెళకువలు కుడా నేర్చుకుంటున్నాడు. ఇక ఈ మూవీకి సంబంధించి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ ను హీరోయిన్ గా ఫిక్స్ చేయాలి అన్న ఉద్దేశ్యంతో ఆమెకు సులువుగా ఉంటుందని ఈ మూవీ షూటింగ్ అంతా కరణ్ జోహార్ సూచనతో ముంబై కి షిఫ్ట్ చేసారు. 

తెలుస్తున్న సమా చారం మేరకు ఈ సినిమా షూటింగ్ జనవరి 20న ముంబైలో ప్రారంభం అయింది. అలా షూటింగ్ మొదలైందో లేదో ఈ చిత్ర యూనిట్‌కు షాక్ తగిలినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం రోజునే తాను ఈ సినిమాలో నటించలేను అంటూ జాన్వీ కపూర్ తన నిర్ణయాన్ని ఆఖరి నిమిషంలో పూరికి చెప్పి షాక్ ఇచ్చినట్లు సమాచారం. 

ప్రస్తుతం ఆమె చాలా సినిమాల్లో నటిస్తుండడం వల్ల డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడం వల్ల ఇలా ఆమె ఈ మూవీ నుండి తప్పుకుంది అన్న ప్రచారం జరిగినా ఆఖరు నిముషంలో ఆమె విజయ్ దేవరకొండతో నటించడం ఇష్టం లేక ఇలాంటి నిర్ణయం తీసుకుంది అన్న ప్రచారం జరుగుతోంది. దీనితో రంగంలోకి దిగిన కరణ్ జోహార్ ఆమె స్థానాన్ని అనన్య పాండేతో భర్తీ  చేసినట్లు తెలుస్తోంది. దీనితో జాన్వి నమ్ముకుని ముంబైకి వెళ్ళిన విజయ్ దేవరకొండకు ఊహించని అవమానం జారి గింది అంటూ జోక్స్ పేలుతున్నాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: