త్రివిక్రం దర్శకత్వంలో అల్లు అర్జున్ పూజా హెగ్డే నటించిన అల వైకుంఠపురంలో సినిమాతో ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెల్సిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరుతో పోటీగా దిగిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా ఇంతక ముందెప్పుడు బన్నీ రాబట్టని వసూళ్లను రాబడుతోంది. త్రివిక్రమ్ కెరీర్ లో కూడా ఈ సినిమా అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. ఇప్పటి వరకు బన్నీ తన ఏ సినిమాతో కూడా ఓవర్సీస్ లో రెండు మిలియన్ ల వసూళ్లను దక్కించుకోలేక పోయాడు.

 

టాప్ 10 లో కాని టాప్ 20లో కాని ఓవర్సీస్ కలెక్షన్స్ జాబితాలో అల్లు అర్జున్ ఇంతకాలం లేడన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు అల వైకుంఠపురంలో సినిమాతో టాప్ 5లో నిలిచాడు. మూడు మిలియన్ ల డాలర్లను రాబట్టి ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది 'అల వైకుంఠపురంలో'. మరో వీకెండ్ లో ఈ సినిమా హాఫ్ మిలియన్ వరకు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం భరత్ అనే నేను  3.42 మిలియన్ డాలర్లతో నాల్గవ స్థానంలో ఉండగా అల వైకుంఠపురంలో 3.02 మిలియన్ డాలర్లతో అయిదవ స్థానంలో నిలిచింది.

 

వచ్చే వీకెండ్ కు ఏమాత్రం వసూళ్లు నమోదు అయినా కూడా భరత్ అనే నేను సినిమాని బీట్ చేసి నాల్గవ స్థానంలో బన్నీ నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల వారు అభిప్రాయపడుతున్నారట. ప్రస్తుతం బాహుబలి 2 మొదటి స్థానంలో ఉండగా.. బాహుబలి రెండవ స్థానంలో.. రంగస్థలం మూడవ స్థానంలో ఉన్నాయి. అల వైకుంఠపురంలో ఇంకాస్త గట్టిగా ట్రై చేస్తే రంగస్థలంను కూడా బీట్ చేసే అవకాశాలు కూడా ఉండొచ్చుననై అంటున్నారు. ఫుల్ రన్ తర్వాత అల వైకుంఠపురం ఏ స్థానంలో ఉంటుందో చూడాలి.

 

ఇక బన్ని సుకుమార్ తెరకెక్కించే సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో బన్ని సరసన కన్నడ బ్యూటి ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ గా ఉన్న రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. ఇంతకముందు బున్ని-సుకుమార్-దేవి కాంబినేషన్ లో ఆర్య, ఆర్య 2 వచ్చి మంచి మ్యూజికల్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈ ముగ్గురికి హ్యాట్రిక్ సినిమా కాబట్టి హిట్ కోసం అందరూ గట్టిగా ట్రై చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: