అమలా పాల్ కేరళకు చెందిన సినీ నటి. అమలాపాల్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి వర్గీస్ పాల్ హఠాత్తుగా మరణించారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తండ్రి మరణవార్తతో అమలాపాల్ కన్నీటిపర్యంతమైంది. అమల నటించిన ‘అదోఅంద పారావాయ్ పోలా’ ట్రైలర్ లాంచ్ నిమిత్తం అమల రెండు రోజుల పాటు చెన్నైలో ఉన్నారు. తన తండ్రి మరణ వార్త వినగానే హుటాహుటిన స్వస్థలమైన కేరళకు వెళ్లారు. బుధవారం మధ్యాహ్నం కురుప్పంపాడి ప్రాంతంలోని సెంట్ పీటర్ అండ్ సెంట్ పాల్ చర్చిలో 3 నుంచి 5 గంటల మధ్యలో అమలా తండ్రి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

 

 పాల్ వర్గీస్‌కి భార్య ఆన్నిస్ పాల్.. పిల్లలు అమల, అభిజీత్ ఉన్నారు. అయితే వాస్త‌వానికి అమలపాల్ సినిమాల్లోకి రావడం ఆమె తండ్రికి మొదటి నుండి ఇష్టం లేదు. అయినా బలవంతం మీద ఆయన్ను ఒప్పించి సినీ రంగంలోకి వచ్చిన  స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది అమ‌లా పాల్‌. 'బెజవాడ' సినిమాతో టాలీవుడ్ లో అమలాపాల్ ఎంట్రీ ఇచ్చింది. రామ్ చరణ్ తో కలిసి నటించిన 'నాయక్' ఆమెకు మంచి నటిగా గుర్తింపును తీసుకురాగా... అల్లు అర్జున్ తో కలసి చేసిన 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం ఆమెకు స్టార్ డమ్ ను తీసుకొచ్చింది. 

 

తెలుగుతో పాటు, తమిళం, మళయాల సినిమాలతో ఆమె బిజీగా ఉంటోంది. అయితే కెరీర్ టాప్ లెవెల్ లో కొనసాగుతున్న సమయంలో తమిళ దర్శకుడు విజయ్ ను ఆమె ప్రేమించి, పెళ్లాడింది. అయితే, ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు రావడంతో వారు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆమెకు ఆశించిన స్థాయిలో సినిమా అవకాశాలు రాలేదు. ఇప్పుడిప్పుడే ఆమె వరుసగా సినిమాలు చేస్తూ జోష్ పెంచింది. కాని, ఇలాంటి స‌మ‌యంలో అమ‌లాపాల్ త‌న తండ్రిని కోల్పోవ‌డం చాలా బాధాక‌రం అని చెప్పాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: