గత కొంతకాలంగా మన టాలీవుడ్లో కుర్ర దర్శకులు రొటీన్ కి భిన్నంగా.. కొత్తగా..ఉండే కథల్ని ఎంచుకుంటూ ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తున్నారు. వాస్తవంగా చెపాలంటే గతంలోకంటే ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కువగా ప్రయోగాత్మక సినిమాలు రూపుదిద్దుకోవడం ఎంతో ఆసక్తికరం. ప్రశాంత్ వర్మ అ!.. వెంకటేష్ మహా- కేరాఫ్ కంచర పాలెం.. తరుణ్ భాస్కర్ - పెళ్లి చూపులు ... గౌతమ్ తిన్ననూరి- జెర్సీ.. రితేష్ రానా- మత్తు వదలరా .. ఇలా తాజాగా టాలీవుడ్ లో యంగ్ డైరెక్టర్స్ తీసిన సినిమాల ఈ లిస్ట్ చూసుకుంటే చాలా పెద్దదే. ఇప్పటి దర్శకులు సెలెక్ట్ చేసుకునే కాన్సెప్ట్.. స్క్రీన్ ప్లే తో ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నారు సక్సెసవుతున్నారు. 

 

ఇక మన టాలీవుడ్ లో యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్లలో సుధీర్ వర్మ ఇలాంటి ప్రయోగాత్మక కథల్ని ఎంచుకుంటున్నప్పటికి.. పాపం ఆశించినంత సక్సెస్ ని దక్కించుకోలేకపోతున్నాడు. సుధీర్ వర్మ తెరకెక్కించిన మొదటి సినిమా 'స్వామి రారా' మంచి క్లాస్ సినిమాగా పేరు తెచ్చుకుంది. కాని ఆ తర్వాత తెరకెక్కించిన దోచెయ్-కేశవ- రణరంగం సినిమాలు మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయ్యాని చూశాయి. దాంతో ఆయన అనుకున్న కథల్ని తెరమీదకు తీసుకురావడంలో తప్పటడుగు వేస్తున్నాడన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ మధ్య శర్వానంద్ తో తీసిన రణరంగం అయితే మరీ ఘోరమైన టాక్ ని తెచ్చుకుంది. ఇది ఈ యంగ్ డైరెక్టర్ కి బాగా షాకిచ్చింది.

 

దాంతో తనలో కసి పెరిగి అయితే పోగొట్టుకున్న చోటే రాబట్టుకునే ఆలోచనలో ఉన్నాడట. అందుకే ఈసారి కథ, స్క్రీన్ ప్లే పరంగా ఎలాంటి పొరపాటులు జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడ. తన నెక్స్ట్ సినిమాకి సొంత కథతో కాకుండా కొరియన్ బ్లాక్ బస్టర్ 'హంజా'ని రీమేక్ చేసే సన్నాహకాల్లో ఉన్నాడట. 2017లో రిలీజైన ఈ సినిమా 'మిడ్ నైట్ రన్నర్స్' పేరుతో హాలీవుడ్ లో రీమేకైంది. ఇప్పుడు తెలుగులో రీమేక్ చేసేందుకు సుధీర్ వర్మ స్క్రిప్టును రెడీ చేస్తున్నారు. ఓ ఫెర్టిలిటీ సెంటర్ కోసం అమ్మాయిల ఎగ్స్ ని దొంగిలించే కిడ్నాపర్స్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. 

 

సినిమా మొత్తం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయని  తెలుస్తోంది. అయితే ఈ కథలో ఇద్దరు హీరోలు ఉండగా.. మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా హీరో హీరోయిన్ బ్యాక్ డ్రాప్ కి మారుస్తున్నారట. కొత్తదనం నిండిన కథని ఎంచుకుని స్క్రీన్ ప్లే పరంగా జాగ్రత్తలు తీసుకుంటే సుధీర్ వర్మ హిట్ కొట్టే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే అతనిలో ఫైర్ అండ్ టాలెంట్ బాగా ఉన్నాయి. మరి చూడాలి ఏం చేస్తాడో. 

మరింత సమాచారం తెలుసుకోండి: