ఈ మద్య సినీ పరిశ్రమలో వరుసగా బయోపిక్ మూవీస్ వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సినీ తారల నేపథ్యంలో వస్తున్న బయోపిక్ లు కొన్ని హిట్ అయితే మరికొన్ని దారుణమైన డిజాస్టర్స్ అవుతున్నాయి. తెలుగులో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘మహానటి’ మూవీ సూపర్ హిట్ అయ్యింది.  ఈ మూవీ సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు.. ఆ నటి పాత్రలో మాలీవుడ్ బ్యూటీ కీర్తి సురేష్ నటించింది.  బాలీవుడ్ లో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ అయిన సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా రణ్ బీర్ కపూర్ నటించిన ‘సంజు’ మంచి హిట్ అందుకుంది.  ఇక తెలుగులో మహానటులు నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ నుంచి ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు రెండు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. 

 

వాస్తవానికి ఎన్టీఆర్ అంటే తెలుగు రాష్ట్ర ప్రజలకే కాదు యావత్ భారత దేశంలో సినీ ప్రియులకు ఎంతో ఇష్టమైన నటులు.  కేవలం ఆయన నటుడిగానే కాకుండా గొప్ప రాజకీయ నాయకులు.. ఆయన స్థాపించిన పార్టీనే తెలుగు దేశం. ఈ కారణంతోనే ఆయన జీవి కథ ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్ తీశారు..కానీ ప్రేక్షకులు మాత్రం ఆ మూవీస్ ని ఆదరించలేకపోయారు. 'మహానటుడు' ఎన్టీఆర్ జీవితంపై వచ్చిన బయోపిక్ ని ప్రేక్షకులు తిరస్కరించడంతో.. నాగార్జున కూడా తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు గొప్పనటులు.. దాంతో ఆయన బయోపిక్ తీసేందుకు గతంలో ప్లాన్ వేసినట్లు టాలీవుడ్ టాక్.

 

కాకపోతే అప్పట్లో నాగార్జున ఒకసారి అక్కినేని నటించిన సినిమాలను రీమేక్ చేయడానికి భయపడే నేను.. ఆయన బయోపిక్ తీసేందుకు సాహసం చేయలేనని ఇన్ డైరెక్ట్ గా బాలయ్యకు  చురకలు అంటించారు. మొత్తానికి ఎన్టీఆర్ బయోపిక్ ఫ్లాప్ అవ్వడంతో ఏఎన్నార్ బయోపిక్ తీయాలనే ఆలోచనలు పూర్తిగా పక్కన పెట్టేసినట్లు టాలీవుడ్ సమాచారం. కాకపోతే మహానటి, ఎన్టీఆర్ బయోపిక్ లో మాత్రం నాగేశ్వరరావు పాత్రలో నటించారు ఆయన మనవళ్లు. 

మరింత సమాచారం తెలుసుకోండి: