విజయశాంతి.. టాప్ హీరోయిన్.. ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ విజయశాంతి. అలాంటి స్టార్ హీరోయిన్ విజయశాంతి దాదాపు 13 ఏళ్ళ నుండి ఒక్క సినిమా కూడా తియ్యలేదు. అయితే ఇటీవలే.. మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరూ సినిమాలో మహేష్ బాబు పాత్ర సమానమైనా పాత్ర పోషించి మార్కులు కొట్టేసింది. 

 

ఆ పాత్ర వల్ల ఆమెకు.. ఆ సినిమాలో ఆమె ఉండటం వల్ల సినిమాకు మంచి మార్కులే పడ్డాయి. అయితే ఇప్పుడు మళ్ళి విజయశాంతి ఇంకో సినిమాలో కనిపించాలంటే కష్టమే అనిపిస్తుంది. ఎందుకు అంటే విజయశాంతి ప్రస్తుతం సినిమాలలో కనిపించడం కష్టంలగే ఉంది. ఎందుకంటే ఆమె షరతులు ఆలా ఉన్నాయి మరి. 

 

ఎంత స్టార్ హీరోయిన్ అయితే మాత్రం.. ఎంత అద్భుత నటన అయితే మాత్రం.. మరి ఇన్ని షరతులా? 13 ఏళ్ళు బ్రేక్ తీసుకున్నారు కదా! మంచి అవకాశాలు రావడమే అరుదు. అలాంటిది ఈవిడా మరి దారుణమైన షరతులు పెట్టి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అసలు అంత దారుణమైన షరతులు ఎం పెట్టారంటే?

 

విజయశాంతి.. ఇప్పుడు ఏదైనా సినిమాలో నటించాలి అంటే... ఆమెకు సమానమైన పెద్ద స్టార్ హీరో సినిమాలో నటించాలంట. చిన్న చితక హీరోలు.. యాంగ్ హీరోల సినిమాలైతే అసలు కథే వినను అని చెప్పేస్తుందట. అంతేకాదు.. ఏ హీరోతో అయితే ఆమె నటిస్తుందో.. ఆ హీరోకు ఉండే అన్ని సౌకర్యాలు ఆమెకు ఉండాలంటా. 

 

ఇంతేకాదు ఇంకా ఉన్నాయి. అవి ఏంటి అంటే.. సినిమా ప్రేమోషన్స్ లో ఆమె కూడా ప్ర‌ముఖంగా క‌నిపించాల‌ని, ముఖ్యంగా పోస్ట‌ర్ల‌లో హీరోతో పాటు స‌మాన‌మైన ప్రాధాన్యం ఇవ్వాల‌ని ఆమె కోరుతుంది. అంతే కాదు ఆ సినిమాలో ఆమె పాత్ర నిడివి ముందు ఎంత చెబితే అంతే ఉండాల‌ని, తీసిన సన్నివేశాలు ఒక్క‌టీ తొల‌గించ‌కూడ‌ద‌ని చెబుతోంద‌ట‌. 

 

ఇప్పుడు చెప్పిన ష‌ర‌తుల‌న్నింటికీ ఒప్పుకుంటే అప్పుడు క‌థ వింటుంద‌ట‌. కథ నచ్చితే సినిమాలో ఆమె అడిగే పారితోషికం ఇవ్వాలని... అయితే ఆమె అడిగినంత పారితోషకం ఇవ్వడానికి రెడీగా ఉన్న ఆమె షరతులే దారుణంగా ఉన్నాయని .. అవి ఒప్పుకోవాలంటేనే కొంచం కష్టంగా ఉన్నాయని ఇండస్ట్రీలో టాక్. మరి చివరికి ఎం అవుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: