ఈ మద్య సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. చిన్న నటుల నుంచి దర్శక, నిర్మాతల వరకు కాలం చేయడం టాలీవుడ్ ని శోకసంద్రంలో మునిగిపోయింది.  ఇక రోడ్డు ప్రమాదాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  అనుకోని ప్రమాదాలు కొన్నైతే.. అతి వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి.  ఆ  మద్య నటుడు డాక్టర్ రాజశేఖర్ కి తృటిలో పెను ప్రమాదం తప్పిపోయింది.. సరైన సమయానికి బెలూన్ ఓపెన్ కావడంతో ఆయన ప్రమాదం నుంచి బయట పడ్డారు.  గత ఏడాది నందమూరి హరికృష్ణ వాహనం కంట్రోల్ కాకపోవడంతో ప్రమాదానికి గురికావడం.. చనిపోవడం జరిగింది. 

 

ఇలా ఎన్నో ప్రమాదాల్లో సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు చనిపోవడం.. తీవ్ర గాయాలు పాలు కావడం జరుగుతుంది. తాజాగా రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ దర్శకుడు మల్లికార్జునరావు తీవ్రంగా గాయపడ్డారు. రెండేళ్ల క్రితం ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బీ’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు.  మల్లికార్జున రావు వయసు 57 ఏళ్లు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు.  ప్రస్తుతానికి ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. కాకపోతే తీవ్రగాయాలు కావడంతో కొన్ని రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు.

 

విషయం తెలిసి సినీ పరిశ్రమకు చెందిన కొందరు పెద్దలు, దర్శకులు ఆసుపత్రికి వెళ్లి మల్లికార్జున రావుని పరామర్శించారు. ప్రమాదంలో గాయపడ్డ ఆయన త్వరగా కోలుకోవాలాని భగవంతుడిని ప్రార్థించారు.  తెలుగు దర్శకుల సంఘం తరఫు నుంచి ఆయనకు తమ మద్దతు తెలిపారు పలువురు దర్శకులు. కాగా, ఇటీవల కాలంలో సెలబ్రెటీలో రోడ్డు ప్రమాదానికి గురికావడంపై ఆందోళన వ్యక్తం చేశారు.  మరోవైపు పలు నగరాల్లో రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గించేందుకు ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: