సాధరణంగా ఒక వ్యక్తి మంచి వాడై, మంచి పనులు చేస్తే అతన్ని మంచివాడుగా భావించిన, తగినంతగా గుర్తింపు రాదు. ఒకవేళ వచ్చినా చాల ఆలస్యంగా వస్తుంది. ఇక చేయకూదని చెడ్దపని చేసాడంటే మాత్రం అప్పటివరకు ఉన్న అతని ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అవుతుంది.. ఇది మరీ సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా కనిపిస్తుంది. ఎవరైన ఎలాంటి హోదాలో ఉన్న అతని మీద చెడ్దవాడు అని ముద్ర పడిందంటే, దాని తాలూకూ ప్రభావం అంత త్వరగా తొలిగిపోదు. ఇకపోతే శాటిలైట్ సెగ్మెంట్ లోనైతే చెప్పనక్కర్లేదు.

 

 

ఉన్నవే 3 ఛానెళ్లు. అలాంటి ఛానెళ్ల వద్ద కూడా పిచ్చి వేషాలు వేస్తే మొదటికే మోసం వస్తుంది. ఇప్పుడు ఓ "వ్యక్తి" విషయంలో అదే జరుగుతోందట. ఇక ఓ వ్యక్తికి ఇండస్ట్రీలో మంచి పట్టు ఉంది. కాంబినేషన్లు బాగా సెట్ చేస్తాడనే ఇమేజ్ అతనికి ఉంది. ఇదే కాకుండా ఒకప్పుడు కొన్ని సినిమాలకు డైలాగులు కూడా రాసి పాపులర్ అయ్యాడతను. తర్వాత చాలా సినిమాలకు తెరవెనక పనిచేయడం, అనధికారిక సహ-నిర్మాతగా వ్యవహరించడం లాంటి పనులు చేశాడు. ఈ క్రమంలో శాటిలైట్ బిజినెస్ దగ్గరకొచ్చేసరికి మాత్రం తనలోని మరో "కోణాన్ని" చూపిస్తాడట. చేతి వాటం బాగా ప్రదర్శిస్తాడట.

 

 

అదెలా అంటే ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఎగ్రిమెంట్ డాక్యుమెంట్లు మార్చడం, తనదే సైన్ అథారిటీ అంటూ నమ్మించడం, నిర్మాతకు తను ఎంత చెబితే అంత అంటూ ఛానెల్ వాళ్ల దగ్గర అడ్వాన్స్ లు నొక్కేయడం లాంటి పనులు చేసే వాడట.. దీని ఫలితంగా ఆ ఛానెళ్లుకు ఇబ్బందులు ఎదురవడంతో పాటుగా కొన్ని లీగల్ సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చిందట. ఇక ఇలాంటి పనికి మాలిన పనులు చేసిన సదరు వ్యక్తి బాగానే వెనకేశాడని ఒక టాక్. చేసిన మోసం ఎన్నాళ్లు దాగుతుంది. బండారం బయటపడగా, ఆ ఛానెళ్ల దృష్టిలో ఇతడు బ్యాడ్ అయిపోయాడట.

 

 

దాని ప్రభావం వల్ల ఏదైనా ప్రాజెక్టులో ఇతడి ప్రమేయం ఉందని తెలిస్తే, వెంటనే ఆ ప్రాజెక్టును పక్కన పెడుతున్నాయట ఛానెళ్లు. ఇతని చేతివాటం కారణంగా ఓ సినిమా శాటిలైట్ కు నోచుకోలేదు సరికదా, భారీ బడ్జెట్‌తో వస్తున్న ఆ సినిమా వాయిదా పడ్డానికి ఇది కూడా ఓ కారణం అని గుస గుసలు వినిపిస్తున్నాయి.. కాగా పరిశ్రమలో అతడి హవా  ప్రస్తుతానికైతే మొత్తానికి కుంటిది కాకుండా నడుస్తోందట. కానీ అది ఎక్కువ రోజులు సాగకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం అవుతుందట. ఇంతకు అతనెవరో బయటకు మాత్రం పొక్కడం లేదు..

మరింత సమాచారం తెలుసుకోండి: