రీమేక్ లో వెంకటేశ్ పాత్ర పేరునే టైటిల్ గా అనుకుంటున్నట్టు టాక్. ఈ సీనియర్ స్టార్ కోలీవుడ్ బ్లాక్ బస్టర్ అసురన్ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో వెంకటేశ్ పాత్రకు సహజత్వానికి దగ్గరగా ఉండే పేరును పెట్టినట్టు తెలుస్తోంది. ఆ పేరునే సినిమా టైటిల్ గా పెట్టాలని భావిస్తున్నారట. 

 

గతేడాది వెంకటేశ్ ఎఫ్ 2, వెంకీమామ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద హంగామా చేశాడు. వరుసగా ఎంటర్ టైన్ మెంట్ మూవీస్ చేసిన ఈ సీనియర్ స్టార్ ఇప్పుడు పంథా మార్చాడు. ఆ రెండు సినిమాలకు, అందులోని పాత్రలకు పూర్తి భిన్నంగా ఉండే క్యారెక్టర్ లో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. అసురన్ రీమేక్ లో వెంకటేశ్ పాత్ర ఎఁత వైవిధ్యంగా ఉంటుందో సినిమా టైటిల్ కూడా అంతే వైవిధ్యంగా ఉండబోతోంది. 

 

అసురన్ రీమేక్ కు మేకర్స్ తెలుగులో నారప్ప అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. సినిమాలో వెంకటేశ్ పాత్ర పేరు నారప్ప అని తెలుస్తోంది. ఇప్పుడు పాత్ర పేరునే టైటిల్ గా ఫిక్సయినట్టు సమాచారం. నేచురాలిటీకి దగ్గరగా ఉండే రీవెంజ్ కథ కావడంతో ఈ టైటిల్ బాగా యాప్ట్ అవుతోందని భావిస్తున్నారట. అయితే మేకర్స్ ఈ టైటిల్ తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందా అనే ఆలోచనలో కూడా ఉన్నట్టు వినికిడి. 

 

బ్రహ్మోత్సవం డిజాస్టర్ తో ఛాన్స్ లు లేకుండా పోయిన శ్రీకాంత్ అడ్డాల ఈ సూపర్ హిట్ రీమేక్ ని హ్యాండిల్ చేస్తున్నాడు. ఫ్యామిలీ మూవీస్ చేసే శ్రీకాంత్ అడ్డాల అసురన్ రీమేక్ కి ఎంత వరకు న్యాయం చేస్తాడనేది ఇంట్రెస్ట్ గా మారింది. రెండు వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతున్న వెంకటేశ్ భార్య పాత్రలో ప్రియమణి నటించనుంది. మరి నారప్ప టైటిల్ నే యూనిట్ ఫిక్స్ చేస్తోందా.. లేక మరో టైటిల్ సర్చ్ చేస్తోందా చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: