బాల‌న‌టిగా కెరియ‌ర్‌ని మొద‌లుపెట్టిన శ్వేతాబ‌సు అతి త‌క్కువ కాలంలోనే టాలీవుడ్‌లో మంచి న‌టిగా గుర్తింపు పొందింది. చ‌క్క‌గా సాగే ఆమె లైఫ్ స‌డెన్‌గా అనుకోని కొన్ని సంఘ‌ట‌న‌లు ఎదుర్కోవ‌ల‌సి వ‌చ్చింది. కొన్ని నింద‌లు ఎదురయ్యాయి.  తన స్నేహితుడు.. బాలీవుడ్ డైరెక్టర్ రొహిత్ మిట్టల్ ను శ్వేతాబసుని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. శ్వేత రియల్ లైఫ్ కీలక మలుపులో అతడు అండగా నిలిచాడు. తాను వ్యక్తిగతంగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటున్న సమయంలో రోహిత్ తనని ఆదుకున్నాడు. త‌న స్నేహితుడు చేసిన సాయం వ‌ల్లే ఆమె తిరిగి పైకి రాగ‌లిగింది. అయితే ఆ ఇద్దరి బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. అతడితో కొన్ని అభిప్రాయ  బేధాలు రావడం తో పెళ్ళి చేసుకున్నా కూడా ఏడాది కూడా కాపురం చేయ‌కుండానే విడాకులు తీసుకున్నారు. ఇదే విష‌యం పై అభిమానుల్లో చర్చకు వచ్చింది. అయితే విడాకులు తీసుకోవడానికి గ‌త కారణాలపై మాత్రం ఇప్పటి వరకూ శ్వేతాబసు స్పందించ లేదు.

 

ఇటీవ‌లె అందుకు గ‌ల కారణాల్ని శ్వేతాబసు వెల్లడించింది. ఒక రకంగా పెద్ద ఫిలాసఫీనే చెప్పింది. మేం ఇరువురం పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నామ‌ని. ప్రతి పుస్తకాన్ని మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకూ ఒకే విధంగా చదవలేం. తొలి పేజీ చదివినంత ఆసక్తి చివరి వరకూ ఉండదు. అంత మాత్రాన ఆ పుస్తకం సరైనది కాదని అనలేం. మా జీవితం ఓ అసంపూర్ణమైన పుస్తకం లాంటిది`` అని వ్యాఖ్యానించింది. ఇక ఈ భామ మాట‌లు ఎలా ఉన్నాయంటే ఏవో వేదాలు చెపుతూ నిరుత్సాహంగా మాట్లాడింది. త‌ను రోహిత్ నుంచి దూర‌మైన‌ప్ప‌టికీ కూడా త‌ను రోహిత్ ఎంతో స్నేహంగా ఉంటామ‌ని చెప్పింది. దీన్ని బ‌ట్టి సెల‌బ్రెటీలు ఇలాంటి బంధాలు బాంధ‌వ్యాల‌ను చాలా లైట్ తీసుకుంటార‌ని అర్ద‌మ‌వుతుంది.  దీంతో శ్వేత వ్యాఖ్యలపై నెటిజనులు రకరకాల కామెంట్ల తో విరుచుకు పడుతున్నారు.

 

ఇక పెళ్ళంటే ఏంటో... జీవితం అంటే ఏంటో... విడిపోవ‌డం అంటే ఏంటో ఇలా అప్పుడే అన్ని విష‌యాల మీద అవ‌గాహ‌న తెచ్చుకున్నావా?  జీవితాన్ని అసంపూర్ణ పుస్తకంతో ముడి పెడతావా? అంటూ కొందరు నెటిజనులు మండి పడుతున్నారు. పెళ్లిళ్లు చేసుకుని కలిసి ఉంటున్న వారంతా... ఆ పుస్తకాన్ని పరిపూర్ణంగా చదవలేదంటావా? నువు ఒక్క‌దానివే అంత గొప్ప‌దానివా అంటూ తెగ తిట్టిపోస్తున్నారు. అన్న‌ట్లు  పుస్తకం పై అంత శ్రద్ద లేకుండానే చివరి వరకూ కలిసి ఉంటున్నారని అంటావా! అంటూ తన వ్యాఖ్యలపై కౌంటర్లు వేస్తున్నారు. `కొత్త బంగారులోకం ` సినిమాతో శ్వేతబసు తెలుగు ప్రేక్షకులకు ప‌రిచ‌య‌మైన ఈ భ‌మ‌ నాలుగైదేళ్ల పాటు నాయికగా కెరీర్ ని సాగించింది. ఆ త‌ర్వాత కొన్ని అనుకోని స్టెప్స్ లైఫ్‌లో వేయ‌డంతో లైఫ్ అంతా స్పాయిల్ అయిన విష‌యం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: