యంగ్ హీరో విజయ్ దేవరకొండ ,డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఫైటర్(వర్కింగ్ టైటిల్ ) యొక్క షూటింగ్  మొన్న ముంబై లో ప్రారంభమైంది. ఈచిత్రం ముంబై తోపాటు  విదేశాల్లో అరు నెలల పాటు షూటింగ్ జరుపుకోనుంది. మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్  సిక్స్ ప్యాక్  లో కనిపించనున్నాడని సమాచారం.
 
ఇక  ఈ సినిమాలో విజయ్ కు జోడిగా  అనన్య పాండే కనిపించనుండగా ప్రముఖ బాలీవుడ్ నటుడు  రోనిత్ రాయ్ , అలాగే ప్రముఖ నటి  రమ్యకృష్ణ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ , ఛార్మి , పూరి కలిసి నిర్మిస్తున్నారు.  ద్విభాషా చిత్రంగా తెలుగు తోపాటు హిందీలోనూ తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని  ప్రముఖ దక్షిణ భాషల్లో కూడా విడుదలచేయనున్నారు.  ఇక పూరి జగన్నాథ్ ,విజయ్ కాంబినేషన్ లో  వస్తున్న మొదటి చిత్రం కావడం తో ఫైటర్ పై  మంచి అంచనాలు వున్నాయి.  
 
అయితే  ఈ సినిమా  కన్నా ముందు విజయ్, వరల్డ్ ఫేమస్ లవర్ తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు ఫేమ్  క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో  రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్నఈ చిత్రంలో  విజయ్ సరసన  ఐశ్వర్య రాజేష్, ఇజా బెల్లె,  కేథరిన్ థ్రెసా మరియు రాశికి ఖన్నా కథానాయికలు గా నటించారు. సీనియర్ నిర్మాత కేఎస్ రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా  గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున ఈ చిత్రాన్ని ప్రేక్షకులముందుకు తీసుకరానున్నారు. ఇటీవల డియర్ కామ్రేడ్ ఫలితం తో ఖంగుతిన్న  విజయ్, ఫేమస్ లవర్ పై  భారీ ఆశలు పెట్టుకున్నాడు. అయితే ఈ సినిమా కు  బజ్ అంతంతమాత్రంగానే వుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: