బాలీవుడ్ కి ధీటుగా మేమున్నామంటూ చాటిచెప్పాయి టాలీవుడ్, కోలీవుడ్ పరిశ్రమలు. గతంలో టాలీవుడ్ కంటే కోలీవుడ్ ఓ మెట్టు పైనుండేది. కానీ.. పదేళ్ల క్రితం నుంచీ టాలీవుడ్ ఆధిపత్యం మొదలయింది. ముఖ్యంగా పాన్ ఇండియన్ సినిమాలతో టాలీవుడ్ తన సత్తా చాటుతోంది. మగధీర, ఈగ, బాహుబలి, సాహో, సైరా.. లతో టాలీవుడ్ పేరు దేశంలో మోగిపోతోంది. దీంతో తెలుగు సినిమాలపై బాలీవుడ్, కోలీవుడ్ లో అక్కసు మొదలైంది.

 

 

సైరా, సాహోకు బాలీవుడ్ లో మీడియా ప్రచారం ఇవ్వలేదు. సైరా.. కు తమిళ్ లో చిరంజీవికి ఫ్రెండ్స్ అనుకున్నవారూ సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు తమిళ సినీ అభిమానులు టాలీవుడ్ ని, తెలుగు హీరోలను, సినిమాలను తక్కువ చేస్తూ ట్రోలింగ్స్ చేస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచీ మొదలైన ఈ గొడవకు వెంకటేశ్ చేస్తున్న నారప్ప సినిమా కారణమైంది. ఈ సినిమాను తమిళ్ లో ధనుష్ చేశాడు. వెంకటేశ్ స్టిల్స్ చూసి తమిళ ఫ్యాన్స్.. #UnrivalledTamilActors and #RealAsuranDhanush అంటూ హ్యాష్ ట్యాగ్స్ తో ట్రోలింగ్స్ మెదలుపెట్టారు. దీంతో మన తెలుగు సినీ అభిమానులు #TeluguRealHeroes అనే హ్యాష్ ట్యాగ్ తో స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. ఈరోజు ఇవన్నీ టాప్ ట్రెండింగ్ లో ఉన్నాయి.

 

 

డ్యాన్సుల్లో, ఫైట్స్ లో కోలీవుడ్ హీరోలకంటే టాలీవుడ్ హీరోలు ఎంతో ఎత్తులో ఉంటారనేది నిజం. తమిళ హీరోల ఓవర్ యాక్టింగ్ పై సెటైర్లు కూడా ఉంటూంటాయి. కాకపోతే వాళ్లు కథలపై పెట్టినంత దృష్టి మనవాళ్లు తక్కువ పెడతారు. ఇప్పుడా అంశంలో కూడా పట్టు సాధించడంతో టాలీవుడ్ సినిమాలు రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. తమిళ్ లో గొప్ప సినిమాలు, హీరోలు ఉన్నారనేది నిజం. ఎవరి బలం వారు నిరూపించుకుంటూనే ఉన్నారు. ఇవన్నీ పక్కన పెట్టి తెలుగు హీరోలను, సినిమాలను తక్కువ చేసిన చూడడం తమిళ అభిమానులకు తగని పని.

మరింత సమాచారం తెలుసుకోండి: