టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మీద కంటిన్యూస్ గా ఒక కంప్లైంట్ వినిపిస్తోంది. అదే చిన్న సినిమాలని గాలికి వదిలేస్తున్నారు అని. ఆయన నిర్మాణం లో వచ్చిన సరిలేరు సినిమాకి ఆయన గారు చేసిన హమాగా, పబ్లిసిటీ, ప్రీ రిలీజ్ ఈవెంట్ తాలూకు హడావిడి మామూలూది కాదు. సూపర్ స్టార్ కోసం మెగాస్టార్ ని తీసుకు వచ్చారు. అయినా సినిమా రిజల్ట్ విషయం తెలిసిందే. అదే రాజ్ తరుణ్ సినిమాని అలా గాలికి వదిలేశారు. ప్రాపర్ పబ్లిసిటి లేకపోవడం ఆ సినిమాకి పెద్ద మైనస్ అయింది. అయితే ఇప్పుడు కూడా ఒక సినిమా విషయంలో దిల్ రాజు ఇలాగే ప్రవర్తిస్తున్నారని అంటున్నారు. అదే తమిళంలో సెన్షేషనల్ హిట్ ని అందుకున్న '96'. ఈ సినిమాని తెలుగులో 'జాను'గా రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే.

 

తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించగా తెలుగులో శర్వానంద్, సమంత జంటగా నటించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవలే టీజర్ విడుదల చేశారు. తాజాగా ఒక పాటను కూడా విడుదల చేశారు. అయితే సినిమాపై అంచనాలు మాత్రం అంతంత మాత్రం గా ఉన్నాయి. మరి సమంత స్టార్ హీరోయిన్ కాదా ..లేక ఇది చిన్న సినిమానా అర్థం కావటం లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. 

 

ఇక ఈ సినిమాను ఫిబ్రవరి 14న విడుదల చేయాలని ముందు అనుకున్నారట. కాని అదే రోజున విజయ్ దేవరకొండ  'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వీళ్ళు డేట్ కూడా ఎప్పుడో లాక్ చేసుకున్నారు..అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేశారు. దాంతో విజయ్ దేవరకొండ తో పోటీ వద్దనుకున్న జాను మేకర్స్ వారం ముందుగానే సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తాజా సమాచారం. అందుకే వారం ముందు కాకుండా ఆలస్యం గా వస్తే పరీక్షల సీజన్ ప్రారంభం అయ్యి కలెక్షన్స్ పై ప్రభావం పడే అవకాశం ఉందని అనుకుంటున్నారట.

 

జాను సినిమాకు ప్రస్తుతం ఫిబ్రవరి 7వ తారీకున రావడం తప్ప ఇంకో ఆప్షన్ లేదని.. దాంతో వారం ముందే ఈ సినిమాని విడుదల చేసేందుకు దిల్ రాజు టీం ప్లాన్ చేస్తున్నట్లుగా లేటెస్ట్ అప్‌డేట్. మరో వారం రోజుల్లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అవుతుందట. దాంతో వెంటనే ప్రమోషన్స్ మొదలు పెట్టబోతున్నారట. వీలైనన్ని ఇంటర్వ్యూస్ సమంత-శర్వానంద్ తో ప్లాన్ చేస్తున్నారట. ఫిబ్రవరి 1 లేదా 2వ తారీకుల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించబోతున్నారు. అయితే సినిమాను ఏమాత్రం హంగామా లేకుండా సింపుల్ గానే విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో రాజుగారు ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి ఎందుకిలా అనేది మాత్రం అర్థం కాలేదు. బహుషా కథ ఆల్రెడీ అందరికీ తెలిసిందే అన్న పాయింటా లేక మరేదైనా ఉందా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: