తండ్రి కూతర్ల బంధం ఒక్క మాటలో చెప్పలేనిది.. వర్ణించలేనిది.. కొందరి తండ్రి కూతుర్ల ప్రేమ బయట పడితే మరికొందరిది భయపడదు.. తండ్రి.. కూతురి కోసం ఏమైనా చేస్తాడు.. అలానే కూతురు కూడా చేస్తుంది. అయితే అడుగులు వేసే సమయంలోనే సుకుమార్ కూతురు తన కోసం అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. 

 

గిఫ్ట్ చూస్తే... ఎవరైనా అద్భుతం అనాలసిందే.. అలానే అంటున్నారు కూడా.. ఆమె టాలెంట్ చూసి.. వావ్... సూపర్ తల్లి నీ టాలెంట్.. నువ్ స్టార్ అయితావ్ అంటూ ప్రోత్సహిస్తున్నారు నెటిజన్లు. అంత అద్భుతమైన పని ఏం చేసింది అబ్బా అనుకుంటున్నారా? అదేనండి.. సుకుమార్ పుట్టిన రోజు సందర్భంగా అతని కూతురు సుకృతి ఓ అద్భుతమైన పాట పడింది. 

 

దర్శకుడు సుకుమార్‌ కుమార్తె సుకృతి తన టాలెంట్‌తో తండ్రికి అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చింది. జనవరి 11న సుకుమార్‌ 50వ పుట్టినరోజు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ పుట్టినరోజు సందర్భంగా సుకుమార్‌ కుమార్తె సుకృతి అతని కోసం ఓ పాట పాడి అది గిఫ్ట్ ఇస్తూ తన తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. 

 

అయితే నేడు సుకృతి పుట్టినరోజు... దీంతో ఆమె పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ ట్విటర్‌ వేదికగా పాటకు సంబంధించిన వీడియోను పోస్ట్‌ చేస్తూ ఆమెకు విషెష్ చేశారు. ''డార్లింగ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ ముద్దుల కుమార్తె సుకృతికి పుట్టినరోజు శుభాంకాంక్షలు. తండ్రి పుట్టినరోజు కోసం తాను పాడిన పాటను.. నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా విడుదల చేస్తున్నాం. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని భావిస్తున్నాను'' అంటూ దేవిశ్రీ ట్విట్ చేశారు. దీంతో ఇది కొన్ని గంటలలోనే వైరల్ అయిపోయింది. సోషల్ మీడియా వేధికగా సుకృతికి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: