కొంతమంది హీరోయిన్స్ కి కెరీర్ మాంచి ఊపులో ఉండి మంచి మంచి సినిమాలలో అవకాశాలు వస్తూ క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికి మాయదారి రోగం తో నానా అడ్డమైన పనులు చేసి అడ్డదారిలో ఇంకా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో జీవితం నాశన్ చేసుకుంటున్నారు. ఒకవేళ నిజంగా సినిమాలో హీరోయిన్ అవకాశమే కానక్కర్లేదు. గుర్తింపు ఉండే ఏ చిన్న పాత్ర అయినా బండి నడిచిపోతుంది. అలా కాదని లగ్జరీ లైఫ్ కావాలనుకొని చేసే ఛండాలపు పనులతోనే జీవితం అయోమయంలో పడుతుంది. అలాంటి హీరోయిన్స్ చాలామందే ఉన్నారు. ఇక తెలుగు, తమిళంలో మంచి హిట్ సినిమాల్లో నటించి హీరోయిన్ గా, నటిగా మంచి గుర్తింపు దపొందిన హీరోయిన్ రంజిత.  ఈమె నటిగా మంచి పీక్స్ లో ఉన్న సమయంలోనే నిత్యానందతో రాసలీలలు వీడియో బయటకు వచ్చి అటి సినిమా కెరీర్ ఇటు వ్యక్తిగత జీవితం సర్వ నాశనం అయ్యింది. 

 

ఈ మాయలోడి భక్తి పారవశ్యంలో మునిగి పోయి అతడికి సేవ చేస్తున్నాను అనుకుని తన కెరీర్ ను నాశనం చెసుకుంది. ప్రస్తుతం నిత్యానంద రంజిత ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి. అలాంటి రంజిత గురించి పరుచూరి గోపాల కృష్ణ రీసెంట్‌గా ఆసక్తికర విషయాలను వెళ్లడించారు. పరుచూరి గోపాల కృష్ణ చిన్న కూతురు స్నేహితురాలట రంజిత. ఆమె ఒకసారి ఆయన కూతురు తో ఇంటికి వచ్చిన సమయం లో ఆమెను చూసి హీరోయిన్ అయ్యే ఫీచర్స్ ఉన్నాయనుకున్నారట.

 

అందుకే కడప రెడ్డమ్మ అనే సినిమాతో రంజిత ను హీరోయిన్ గా నేను పరిచయం చేరట. ఇక మొదటి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత తమిళంలో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అయితే ఒకసారి రైల్వే స్టేషన్ లో కలిసినప్పుడు పరుచూరి దగ్గరకు వచ్చి థ్యాంక్స్ అంకుల్ మీ వల్లే ఈ కెరీర్ అంటూ కృతజ్ఞతలు చెప్పిందట.

 

ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు రంజిత నిత్యానందకు సంబంధించిన ఒక బుక్ ను తీసుకు వచ్చి అతని గురించి తెలుసుకోవాల్సిందిగా కోరిందట. అప్పుడు పరుచూరి .. నాకు అలాంటి వారిపై నమ్మకం లేదని.. కూడా ఇలాంటివి నమ్మకుండా కెరీర్ పై దృష్టి పెట్టుమని చెప్పారట. అయినా రంజిత నిత్యానంద భక్తి మత్తు లో మరీ అంతగా మునిగి పోతుందని అనుకోలేదు అంటూ పరుచూరి ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు నిత్యానందతో రంజిత వీడియో బయట కు వచ్చినప్పుడు నా గుండె పగిలి పోయినంత పనైందని బాధపడ్డారు. ఏదేమైనా రంజిత ఎక్కడున్నా బాగుండాలి.. ఆమె నాకు కూతురులా అంటూ పరుచూరి తెలిపారు. అయితే ఎవరి ఖర్మకి ఎవరి బాధ్యులు ..ఎవరి తల రాతను ఎవరు మార్చగలరు. నాశనం అవ్వాలని రాసిపెట్టి ఉంటే పరుచూరి కాదు ఆ దేవుడే దిగి వచ్చినా విని చావరు కదా కొంతమంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: