సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గుణశేఖర్ తెరకెక్కించిన 'ఒక్కడు' ఎంతటి బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే. రెండు గ్రూపుల మధ్య గ్యాంగ్ వార్... రాయలసీమ ఫ్యాక్షనిజం...సెన్సిబుల్ లవ్ స్టోరీ తో పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాని రూపొందించారు. మెలోడి బ్రమ్హ మణిశర్మ అందించిన అద్భుతమైన సంగీతం ఈ సినిమాకి మేయిన్ పిల్లర్ అని ఖచ్చితంగా చెప్పాలి. అంతేకాదు సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు పెద్ద ఎస్సెట్. దీంతో ఒక్కడు మహేష్ కెరీర్ లో మరపురాని మైలురాయిగా నిలిచింది. నటుడిగా మహేష్ మైలేజ్ ని పెంచిన సినిమాగా ఒక్కడు బాగా పాపులరైంది. మురారి తర్వాత మహేష్ కి అంత గొప్ప పేరు తెచ్చింది ఒక్కడు. 


 
మరి ఆ రేంజ్ లో స్క్రిప్టుని ఇప్పటివరకూ ఏ దర్శక, రచయిత ట్రై చేలేదు. తాజాగా ఒక్కడు లాంటి అదిరిపోయే స్క్రిప్ట్ ఉంటే నా దగ్గరకు తీసుకురండి. ఎన్ని కోట్లు ఖర్చయినా నేను తీస్తానంటూ ప్రముఖ నిర్మాత దిల్ రాజు వెల్లడించారు. తాజా ఇచ్చిన ఓ ఇంటర్వూలో ఈ విషయాన్ని దిల్ రాజు ఓపె గా ప్రకటించారు. ఒక్కడు రిలీజ్ టైమ్ లోనే  నిర్మాతగా పరిచయం అవ్వాలని రాజుగారు ఎంతో ఆత్రంగా వెయిట్ చేశానని దిల్ సినిమాకి సంబంధించిన పనుల్లో వినాయక్ తో కలిసి పని చేస్తున్న సమయంలో జరిగిన అనుభవాలని గుర్తు చేసుకున్నారు.

 

నిర్మాత కావాలనుకున్న సమయంలో ఒక్కడు వచ్చి బ్లాక్ బస్టర్ అయింది. ఇలాంటి స్క్రిప్ట్ తో లాంచ్ అయితేనే బాగుండేదని రాజుగారు అనుకున్నారుట. నిర్మాతగా పరిచయమైన తర్వాత చాలా మంది హీరోలతో డిఫరెంట్ కథల్ని ఎంచుకుని సినిమాలు తీసానని... కానీ ఒక్కడు లాంటి స్క్రిప్ట్ ఇన్నేళ్ల జర్నీలో ఏ ఒక్కరు తీసుకురాలేదని తెలిపాడు. అంతేకాదు అలాంటి స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్నానని తెలిపారు. ఇలాంటి కథ- కంటెంట్ తో తన దగ్గరకు వస్తే హీరోని కూడా నేనే సెట్ చేసుకుంటానని అన్నారు. మరి దీనికి చార్మినార్ వమంటి సెట్ వేస్తారా ..అసలు అలాంటి కథ తెచ్చే వాళ్ళు ఉన్నారా అన్నది సందేహం. 

మరింత సమాచారం తెలుసుకోండి: