మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు వచ్చినప్పటికి ఒప్పుకోకుండా కోలీవుడ్ లో మాత్రం రైల్ వంటి డిజాస్టర్ సినిమాతో సహా వచ్చిన ప్రతీ సినిమాని ఒప్పుకుంటూ బిజీ అయిన సంగతి తెలిసిందే. మహానటి సినిమాతో వచ్చిన క్రేజ్ తో గ్లామర్ అండ్ రొమాన్స్ తో పాటు మసాలా సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపించచలేదు. అయితే లేడీ ఓరియేంటెటెడ్ సినిమాలు మాత్రం అంగీకరిస్తోంది. ఇక రెగ్యులర్ గ్లామర్ రోల్స్ కి నిర్మొహమాటంగా నో చెప్పేస్తోంది. అయితే కోలీవుడ్ లో మాత్రం తనకు వచ్చిన ఏ అవకాశాన్ని వదిలిపెట్టలేదు. గ్లామర్ రోల్స్ తో పాటు సోలో హీరోయిన్ గా తనకు పేరు వస్తుందనుకునే సినిమాలకు సైన్ చేసేస్తోంది.

 

ప్రస్తుతం కీర్తికి ఓ అరుదైన అవకాశం వచ్చినట్టు కోలీవుడ్ మీడియా తాజా సమాచారం. కీర్తి తల్లి మేనక నటించిన 'నేత్రిక్కన్' (రజనీకాంత్- మేనక జంటగా) రీమేక్ లో నటించే అవకాశం దక్కించుకుందట. ఈ సినిమాలో తన తల్లి మేనక పోషించిన పాత్రలో నటించనుందట కీర్తి. కన్నడ-తమిళంలో మేనక నాటి మేటి నాయికల్లో ఒకరిగా ఒక వెలుగు వెలిగారు. తల్లి వారసత్వాన్ని పుణికి పుచ్చుకునే కీర్తి బాలనటిగా తెరంగేట్రం చేసి టీనేజ్ లోనే హీరోయిన్ గా పాపులర్ అయ్యింది. లక్కీగా ఇప్పుడు తన తల్లి నటించిన సినిమా సీక్వెల్ లోనే అవకాశం దక్కించుకుంది.

 

నేత్రిక్కన్ సినిమాకి సీక్వెల్ చేయాలన్న కొన్నేళ్ళ కలని ని సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ ఇటీవలే తెలిపాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ తో పాటు కాస్టింగ్ సెలక్షన్ లో ధనుష్  బిజీగా ఉన్నాడట. మామ రజనీకాంత్ నటించిన పాత్రలోనే ధనుష్ నటించనున్నాడు. తన సరసన కీర్తి నటించనుంది. ఇక ధనుష్-కీర్తి సురేష్ గతం లో 'రైల్' అనే డిజాస్టర్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇక నేత్రిక్కన్ సీక్వెల్ కి ధనుష్ నిర్మాతగా వ్యవరించనున్నారని కోలీవుడ్ వర్గాల ద్వారా అందిన సమాచారం. అయితే టాలీవుడ్ లో వకాశాలిస్తున్న మేకర్ కి షాకిస్తూ కీర్తి కోలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తోంది. తాజా రజనీ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కీర్తి కనిపించనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: