చాలా మంది టీజర్ ను ఎంటర్ టైన్ మెంట్ గా డిజైన్ చేసి సినిమాలపై అంచనాలను పెంచేస్తారు. మరికొందరు యాక్షన్ తో ఇంప్రెస్ చేస్తారు. కానీ.. ఓ యంగ్ హీరో మాత్రం ఫీల్ గుడ్ టీజర్ తో ఆకట్టుకుంటున్నాడు. అక్కడితో ఆగకుండా.. ఫీల్ ఉన్న సాంగ్ తో మరోసారి ఆకట్టుకుంటున్నాడు. 

 

ఫీల్ గుడ్ మూవీస్ అంటే ముందుగా గుర్తొచ్చే హీరో శర్వానంద్. ప్రేమ కథలతో మనసు హత్తుకోవడం శర్వానంద్ స్పెషాలిటీ. ఇదే రూటులో ఎక్కువగా ప్రయాణించే శర్వానంద్ జాను అంటూ మరోసారి హార్ట్ టచింగ్ మూవీతో వస్తున్నాడు. తమిళంలో 50కోట్లకు పైగా కలెక్ట్ చేసిన చిత్రం 96.. తెలగు రిమేక్ గా జాను పేరుతో రిమేక్ అవుతోంది. ఒరిజినల్ వెర్షన్ తీసిన ప్రేమ కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు జానూను నిర్మిస్తున్నారు.

ప్రాణం పాటను శ్రీమణి రాయగా.. చిన్మయి శ్రీపాద, గౌతమ్ భరద్వాజ్ ఆలపించారు. 96కు సంగీతం అందించిన గోవింద వసంత మ్యూజిక్ ఇస్తున్నాడు. లిరికల్ వీడియోను మంగళవారం రిలీజ్ చేశారు. ప్రస్థానం, గమ్యం సినిమాలు శర్వానంద్ ను మంచి హీరోగా గుర్తింపునిచ్చాయి. ఆయన నటన సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఏ మాత్రం వల్గారిటీకి తావు లేకుండా నెమ్మదిగా సాగిపోతుంది. అందుకే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా శర్వానంద్ సినిమాలు ఉంటాయి. అంతేకాదు ఓ నీతిని నేర్పేవిధంగా ఆయన మూవీస్ ఉంటాయి. అందుకే శర్వానంద్ కు ప్రేక్షకుల్లో అంత ఆదరణ. ఆయన సినిమా వస్తుందంటే ఏదో మంచి థీమ్ ఉన్న సినిమా అయి ఉంటుందని సగటు ప్రేక్షకుడు భావిస్తాడు. ఇపుడు వస్తున్న జాను మూవీపై కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు సినీ జనాలు. అసలు ఆ సినిమాలో శర్వానంద్ ఎలా ఆకట్టుకుంటాడోనన్న ఉత్కంఠ వారిలో నెలకొంది. ఇప్పటికే లిరికల్ వీడియో రిలీజ్ కాగా.. సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: