లోకంలో మనుషుల తీరులో వచ్చిన మార్పు వల్ల జరగరాని అనర్దాలు జరుగుతున్నాయి. ఇదే కాకుండా సాధారణంగా హత్యాచారాలు రోజుకు ఎన్ని జరుగుతున్నాయో అసలు లెక్కేలేదు. ఇక ఆడవాళ్లూ, ముసలి వారు, పసిపిల్లలు అనే తేడా లేకుండా రెచ్చిపోతున్న మృగాళ్ల కోరికలు సంకెళ్లు వేసి ఆపడం ఘగనం అయ్యింది.

 

 

ఈ స్దితిలో ఇప్పుడు తెరపైకి మరో వివాదం వచ్చింది. అదేమంటే, అమ్మాయిలతో పాటుగా, అబ్బాయిలకు కూడా వేధింపులు తప్పడం లేదట. ఈ సమస్య ఎక్కువగా అన్ని చోట్ల మొదలవుతున్న, ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో కూడ తప్పడం లేదట.

 

 

ఇకపోతే ఎప్పుడు అమ్మాయిలను వేధిస్తున్నారని వార్తలు వస్తున్నాయే, తప్ప అబ్బాయిల విషయంలో మాత్రం బయటపడటం లేదట. ఇలాంటి సందర్భంలో తాజాగా అబ్బాయిలపై కూడా వేధింపులు జరుగుతున్నాయని సన్నీ లియోన్ చేసిన వ్యాఖ్యలు సంచలననానికి తెర తీసాయి..

 

 

అయితే కొన్ని కొన్ని చోట్ల అబ్బాయిలపై జరుగుతున్న అఘాయిత్యాలు బయటకు పొక్కడం లేదని, ఇలా జరుగుతున్న, అబ్బాయిలు అనే పదం తోకలా ఉండటం వల్ల ఇలాంటి విషయాలు బయటపడితే పరువు గోదాట్లో కలిసిపోతుందనే భయంతో మగపురుషులు అనే చెప్పుకునే వారు తమ పై జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి ఎక్కడ నోరు విప్పడం లేదట..

 

 

అయితే కాస్టింగ్ కౌచ్ పేరిట అమ్మాయిలపై జరుగుతున్న వేధింపులు ప్రచారంలోకి వచ్చినట్లే, అబ్బాయిలు కూడా బయటపడటం మంచిదని దీనివల్ల కొంతమందికి అయినా లైంగిక వేధింపుల బాధ తప్పుతుందని సన్నీ లియోన్ సూచించింది..

 

 

ఇకపోతే సన్నీ లియోన్ చేసిన ఈ వాఖ్యల పట్ల సినిమా ఇండస్ట్రీలో సంచలనాలు పుట్టేలా కనిపిస్తున్నాయని కొందరు అనుమానాన్ని తెలియచేస్తున్నారట.. ఇక ఇప్పుడున్న పరిస్దితుల్లో ఎవరు ఎన్ని నీతులు చెప్పిన, సమాజాన్ని మార్చడం చాలా కష్టం. మొక్కై వంగనిది మానై వంగుతుందా అనే సామేత ఊరికే రాలేదు.

 

 

ఎవరో ఒక్కరు సమాజాన్ని మార్చాలని నడుం కడితే సరిపోదు. ప్రతి గడపనుండి ఈ ఆలోచన మొదలై అది ఆచరణగా మారితే దాని ఫలితం రావడానికి చాలా సమయం పడుతుంది. అంతవరకు ఎవరు ఎన్ని రకాల స్పీచ్‌లు ఇచ్చినా చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లే అని అనుకుంటున్నారట ఈ ముచ్చట తెలిసిన కొందరు..

మరింత సమాచారం తెలుసుకోండి: