ఇటీవల సైరా నరసింహారెడ్డి సినిమాతో పర్వాలేదనిపించే విజయాన్ని అందుకున్న మెగాస్టార్ చిరంజీవి, ప్రస్తుతం సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. మెగాస్టార్ ఒక డిఫరెంట్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాలో ఒక స్టార్ హీరోయిన్ నటిస్తున్నట్లు సమాచారం. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయింది. ఇక ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి శారీరకంగా కూడా ఎంతో బరువు తగ్గి కొంత స్లిమ్ గా తయారయ్యారు. కొన్నేళ్ల క్రితం మెగాస్టార్, మణిశర్మ ల కాంబోలో వచ్చిన ఠాగూర్ తరువాత మళ్ళి ఇన్నేళ్లకు వీరిద్దరూ కలిసి పని చేస్తున్నారు. 

 

ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి ఇటీవల మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రత్యేకంగా విచ్చేసిన మెగాస్టార్ మాట్లాడుతూ, మహేష్ తో ఈ సరిలేరు సినిమాని అనిల్ కేవలం ఐదు నెలల్లో పూర్తి చేసారంటే అది నిజంగా పెద్ద వండర్ అని, కావున తనతో సినిమా తీస్తున్న కొరటాల కూడా తమ సినిమాని 100 రోజుల్లోపే తీయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అయితే మెగాస్టార్ అన్న మాటకు కొరటాల కూడా ఓకే సర్ తప్పకుండా చేద్దాం అంటూ స్టేజ్ పై చెప్పడం జరిగింది. ఇక ప్రస్తుతం తాను మాటిచ్చిన విధంగానే ఇటీవల షూటింగ్ మొదలెట్టిన కొరటాల

 

ఏ మాత్రం ఎక్కడా కూడా లేట్ కాకుండా, అలానే వెస్టీజ్ లేకుండా సినిమాని పరిగెత్తిస్తున్నారట. అలానే షెడ్యూల్స్ ని కూడా పక్కాగా ప్లాన్ చేసుకున్నారని, ఇటీవల సంగీత దర్శకుడు మణిశర్మతో కలిసి బ్యాంకాక్ వెళ్లిన కొరటాల, మంచి ట్యూన్స్ ని కూడా సిద్ధం చేయించడం జరిగిందని అంటున్నారు. సో, దీనిని బట్టి చూస్తుంటే మెగాస్టార్ చెప్పిన మాటని మంచి ఛాలెంజ్ గా తీసుకున్న కొరటాల, అనుకున్న విధంగానే సినిమాని ముందుకు తీసుకెళుతూ 100 రోజుల్లోపే రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోందని అంటున్నారు. మరి అయితే చూడాలి రాబోయే రోజుల్లో ఈ సినిమా విషయమై ఏమి జరుగుతుందో...!!

మరింత సమాచారం తెలుసుకోండి: