పాపం మన సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తులు సెటిలవ్వాలని 30 ఏళ్ళు వచ్చేదాకా పెళ్ళి చేసుకోకుండా టైం వేస్ట్ చేసుకుంటారు. ఆ తర్వాత పెళ్ళి చేసుకుందామన్నా టైం కలిసి రాదు. 30 దాటి 35 ఏళ్ళు దగ్గరపడుతున్న ఒక్క పెళ్ళి కూడా సెట్ కాదు. కాని సినిమా సెలబృతీస్ మాత్రం ఎన్ని సార్లైనా పెళ్ళి చేసుకుంటు షాకిస్తున్నారు. అది టాలీవుడ్ బాలీవుడ్ హాలీవుడ్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సాధారణంగా మన సంసృతి సాంప్రదాయాల ప్రకారం జీవితంలో భాగస్వామిగా ఒక్కర్నే ఊహించుకోగలం. ఒక్కసారే పెళ్ళి చేసుకోగలం. వారితో కలకాలం కలిసుండాలని కోరుకుంటాం. 

 

అగ్ని సాక్షిగా పెళ్ళి చేసుకున్నాక ఎవైనా సమస్యలు వచ్చినప్పటికి సరిదిద్దుకుపోవాలని అనుకుంటాం. అంతగా కుదరకపోతే విడి విడిగా ఉంటూ కన్న పిల్లలని జాగ్రత్తగా చూసుకుంటుంటారు కొందరు. అదీ కూడా కుదరకపోతే విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకుంటారు. ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకున్నవారు చాలా మంది ఉన్నారు. అయితే ప్రముఖ హాలీవుడ్ నటి పమేలా ఆండర్సన్ మాత్రం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదో పెళ్లి చేసుకున్నారు. అందులోనూ 52 ఏళ్ల వయసులో. ఇది ఏ దేశం సాంప్రదాయమో ఆవిడకే తెలియాలి. అసలు ఈ వయసులో అయిదు పెళ్ళిళ్ళు చేసుకుందంటే సాంప్రదాయామా షాంపేయిన్ బాటిలా ...అనుకోక తప్పదు. 

 

1995లో టామీ లీ అనే నటుడ్ని పెళ్లి చేసుకున్నారు. మూడేళ్లకే అతనితో విడిపోయారు. ఆ తర్వాత కిడ్ రాక్ అనే మరో వ్యక్తిని పెళ్ళి చేసుకుంది. ఈ పెళ్లీ పెటాకులైంది. మూడోసారి పోకర్ ప్లేయర్ రిక్ సాలోమన్‌ను వివాహం చేసుకున్నారు. ఇతనితో విడిపోయి మళ్లీ కలిసిపోయి మళ్లీ అతన్నే పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ విడిపోయారు. ఇదేదో ఆటగా ఉంది కదా. అయితే ఇప్పుడు మళ్ళీ హాలీవుడ్ నిర్మాత జాన్ పీటర్స్‌ను రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. మలీబూలో రీసెంట్‌గా వీళ్ళ పెళ్ళి జరిగిందట.

 

ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. దాదాపు 36 ఏళ్లుగా పమేలా జాన్ పీటర్స్‌తో డేటింగ్‌లో ఉన్నారట. ఈ విషయాన్ని పీటర్స్ ఓ సందర్భంలో మీడియా ముందు వెల్లడించారు. తన చుట్టూ ఎంతో మంది అందమైన అమ్మాయిలు ఉన్నప్పటికీ తనకు పమేలాతోనే జీవితాన్ని పంచుకోవాలని ఉండేదని తన మనసులో ఉన్న మాటను బయట పెట్టాడు. ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. జాన్ పీటర్స్‌కి కూడా ఇది ఐదో పెళ్లే. అతని చివరి వివాహ బంధం 2014లో తెగిపోయిందట. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటించిన ‘బేవాచ్’ సినిమాలో పమేలా కీలక పాత్రలో నటించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: