టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన తాజా సినిమా అలవైకుంఠపురములో ఇటీవల ప్రేక్షకులు ముందుకు వచ్చి బాగానే టాక్ ని సంపాదించడం జరిగింది. నిజానికి సూపర్ హిట్ సినిమాకు ఉండవలసిన స్టఫ్ ఈ సినిమాలో లేనప్పటికీ, కొన్ని ఫ్యామిలీ ఎమోషనల్ సీన్స్, ఎంటర్టైన్మెంట్, త్రివిక్రమ్ పంచెస్ వంటివి ఈ సినిమాకు బాగా కలిసి వచ్చాయి. అలానే మరీ ముఖ్యంగా సంక్రాంతి సీజన్ తో వరుసగా సెలవలు కావడం ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ రావడానికి మరింత దోహదపడింది. ఇకపోతే సరిగ్గా ఈ సినిమాకు ఒక రోజు ముందుగా రిలీజ్ అయిన సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి యావరేజ్ టాక్ ని దక్కించుకుంది. అయితే పండుగ సీజన్ ఆ సినిమాకు కూడా మరింత కలిసి రావడంతో పాటు, 

 

మహేష్ బాబు ఆ సినిమాలో చాలా రోజుల తరువాత మంచి ఎంటర్టైన్మెంట్ రోల్ పోషించడం సినిమాకు బాగా కలిసి వచ్చింది. ఇక తొలి రోజు నుండి ఈ రెండు సినిమాల మధ్య కలెక్షన్స్ గొడవ ప్రారంభం అయింది. ఒకరికి మించి మరొకరు పోటీ పడి మరీ తమ సినిమాలకు ఇంత కలెక్షన్స్ వచ్చాయి, అంత కలెక్షన్స్ వచ్చాయి అంటూ పోస్టర్లు ప్రకటించడం జరిగింది. ఇక ఇటీవల ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల మార్క్ షేర్ ని క్రాస్ చేసిన ఈ రెండు సినిమాలు కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ని అందుకుని, మరికొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కి దగ్గరగా ఉన్నాయి. కాగా రెండిటిలో సరిలేరు మన తెలుగు రాష్ట్రాల్లో, అలానే అల సినిమా ఓవర్సీస్ లో పైచేయిగా కలెక్షన్స్ సాగిస్తున్నాయని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ, నాలుగు రోజుల నుండి రెండు సినిమాల యూనిట్ల వారు మరింతగా పోటీ పడి కలెక్షన్స్ ని రిలీజ్ చేస్తుండడంతో వారిలో అసలు ఏది నిజమో ఏది అబద్దమో కూడా ప్రేక్షకులు తేల్చుకోలేని పరిస్థితులు వచ్చాయి. 

 

ఇకపోతే నిన్న తమ సినిమా రూ.200 కోట్ల గ్రాస్ కలెక్షన్ ని అందుకుందని సరిలేరు టీమ్ ఒక పోస్టర్ రిలీజ్ చేయగా, నేడు వారిని మించేలా అల టీమ్, తమ సినిమా ఏకంగా రూ.220 కోట్ల గ్రాస్ వసూలు చేసి నాన్ బాహుబలి 2 రికార్డు క్రియేట్ చేసిందని పోస్టర్ రిలీజ్ చేసారు. అయితే అల సినిమాకు సంబంధించి ఈ విధంగా సరిలేరుని మించేలా పోస్టర్స్ రిలీజ్ చేస్తోంది గీతా ఆర్ట్స్ సంస్థకు చెందిన పిఆర్ టీమ్ వారు అని కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి సమాచారం అందుతోంది. మరి 11 రోజులకు తమ సినిమా రూ. 220 కోట్ల గ్రాస్ రిలీజ్ చేసిందని పోస్టర్ వదిలిన అల యూనిట్, 12 రోజులకు రూ. 240, 13 రోజులకు రూ. 260, 14 రోజులకు రూ. 280, ఇక ఏకంగా 15 రోజులకు రూ.300 కోట్లు వసూలు చేసిందని పోస్టర్ రిలీజ్ చేస్తారని కొందరు ప్రేక్షకులు పకపకా నవ్వుకుంటున్నారు. మరి ఈ రెండు సినిమాల మధ్య ఈ ఫేక్ కలెక్షన్స్ పోరు ఎప్పుడు ఆగుతుందో ఏమో అర్ధం కావడం లేదని, ఈ విధంగా ఒకరిపై మరొకరు పోటీ గా ఫేక్ కలెక్షన్స్ పోస్టర్స్ రిలీజ్ చేస్తుంటే రాబోయే రోజుల్లో ఇతర హిట్ సినిమాలకు నిజంగా వచ్చే కలెక్షన్స్ పై కూడా ప్రజల దృష్టిలో నెగటివ్ ఇంప్రెషన్ పడే అవకాశం ఉందని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: