కోలీవుడ్ లో ధనుష్ హీరోగా రూరల్ బ్యాక్ డ్రాప్ లో వెట్రిమారన్  తెరకెక్కించిన చిత్రం అసురన్. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేసి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈసినిమా ను  తెలుగులో విక్టరీ వెంకటేష్ తో రీమేక్ చేస్తున్నారు.  అయితే మొదట్లో వెంకీరీమేక్ చేయనున్నాడంటే అతనికేం సెట్ అవుతుందని తెలుగు జనాలే  పెదవి విరిచారు కానీ నిన్న ఈ  రీమేక్ టైటిల్ తోపాటు  ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదలచేశాక చాలా మంది షాక్ తిన్నారు. ఎందుకంటే ఫస్ట్ లుక్ పోస్టర్ల లో వెంకీ అదరగొట్టాడు. ఇంకా చెప్పాలంటే ధనుష్ కంటే కూడా ఆ గెటప్ వెంకీ కి బాగా సెట్ అయ్యింది.  దాంతో  ఈఫస్ట్ లుక్  యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ ను  తెచ్చుకొని సినిమా పై  అంచనాలను పెంచింది. 
 
అయితే  తమిళ జనాలు మాత్రం వెంకీ లుక్ పై ట్రోల్ చేస్తున్నారు. ఎక్స్పెక్ట్ టేషన్ వర్సస్ రియాల్టీ అంటూ ధనుష్ , వెంకీ కి పోలిక పెట్టి  వెంకీ లుక్  తేలిపోయినట్లుగా  కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు రియల్ అసురన్ అంటూ ధనుష్ ఫొటో తో సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తున్నారు. అయితే వీటికి మనోళ్లు  స్ట్రాంగ్ గా కాంటర్ ఇస్తున్నారు. ఇక నారప్ప అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం  ఈరోజు నుండి సెట్స్ మీదకు వెళ్ళింది. అందులో భాగంగా  అనంతరపురం లోని ఉరవకొండ లో  మొదటి షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది. ఈ చిత్రంలో వెంకీ కి జోడిగా  ప్రియమణి నటిస్తుండగా  మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.  ఫ్యామిలీ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ బాబు , ఎస్ థాను  నిర్మిస్తున్నారు. మే లో ఈచిత్రం విడుదలకానుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: