సెల‌బ్రెటీలు ఏం చేసినా కూడా ట్రెండే. వారు ఏది వేసుకున్నా ఏం వాడినా ప్ర‌తిదీ అందంగానూ ఆశ్చ‌ర్యంగానూ చూస్తారు. వాళ్ళు డ్ర‌స్ ద‌గ్గ‌ర నుంచి వాళ్ళు వాడే కాస్మెటిక్స్ వ‌ర‌కు ప్ర‌తిదీ కూడా ఎంతో  క్రేజీగా చూస్తుంటారు చాలా మంది. ఇక బికినీ విష‌యానికి వ‌స్తే దాని ధ‌ర ఎంతుంటుంది? మ‌హా అయితే మూడు నుంచి నాలుగు వేలు ఉంటుంది. కానీ ఒక బికినీ ధ‌ర వింటే మీరు షాక్ అవ్వాల్సిందే. అదేంటి అనుకుంటున్నారా? అవునండి ఆ బికినీ అంత కాస్ట్ మ‌రి. 

 

 ఒక బికినీ ధర తెలిసి ఏకంగా బాలివుడ్ జనం కూడా షాక్ అయ్యారు. ఊహించని ధర పలికింది ఆ బికినీ.
ఇక బాలివుడ్ లో బికినీ అనేది సర్వ‌సాధార‌ణం. బాలివుడ్ లో ప్రతీ సినిమాలో ఏదోఒక‌ సందర్భంలో బికినీ కనపడుతుంది. హీరోయిన్లు కంపల్‌స‌రీ బికినీ వేస్తారు. దీనిని ప్రజలు కూడా పెద్దగా సీరియస్ గా తీసుకోవడం లేదు. ఇది బాలీవుడ్ సాంప్ర‌దాయంగా తీసుకుంటున్నారు. ఇక సాంప్రదాయాలు అదీ ఇది అని మాట్లాడే వారు బికినీ చూసి లైట్ తీసుకుంటున్నారు. గ్లామర్ ఇండస్ట్రీలో గ్లామర్ గా కనిపించాలి అంటే బికినీ తప్పనిసరి అన్న‌ట్లు ఉంటున్నారు. అందుకే బికినీలు వేసుకోవడానికి ఎలాంటి షరతులు పెట్టకుండా నిర్మొహ‌మాటంగా వేసేస్తున్నారు హీరోయిన్లు.

 

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన స్టార్ కిడ్ తార సుతారియా ఇటీవల బికినిలో ఒక ఫోటోషూట్ చేసింది. చాక్లెట్ కలర్ లో ఉన్న‌ మోనోకినిలో మెరుపులు మెరిపించింది. సింపుల్ గా ఉన్న బికినీ ఖరీదు రూ. 25వేలు. 25 వేలరూపాయల బికినీ అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. మ‌రికొంత మంది ఇదికామ‌నే క‌దా అన్న‌ట్లు ఉన్నా.. ఇంకొంత‌మంది మాత్రం టూపీస్ బికినీ ఇంత కాస్టా అన్న‌ట్లు నోరు తెరిచారు.  బాలివుడ్ లో ఇప్పటి వరకు ఇదే కాస్ట్లీ బికినీ అంటున్నారు కొందరు సిని జనం. మ‌రి ఇంత కాస్ట్లీ బికినీ వేసిన ఈ భామ నెల‌కి ఎంత సంపాదిస్తోందో. 

మరింత సమాచారం తెలుసుకోండి: