సంక్రాంతి సూపర్ హిట్ బొమ్మ అల వైకుంఠపురములో సినిమాతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన అసలు స్టామినా ఏంటో చూపించాడు. నా పేరు సూర్య ఫ్లాప్ తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకుని త్రివిక్రం తో అల వైకుంఠపురములో సినిమా చేసిన బన్ని ఈ సినిమాతో మరో రేంజ్ కు వెళ్లాడు. ఈ సినిమా బన్ని కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాలో చిన్న పాత్ర అయినా సరే ఎలాంటి మొహమాటం లేకుండా చేశాడు అక్కినేని నాగార్జున మేనళ్లుడు సుశాంత్. 

 

ఓ పక్క హీరోగా తన ప్రయత్నాలు చేస్తూనే సడెన్ గా ఓ స్టార్ హీరో సినిమాలో చిన్న రోల్ చేయడం అక్కినేని ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది. ఈ సినిమా చూసిన తర్వాత సుశాంత్ ఎలాంటి పాత్ర అయినా చేస్తాడన్న నమ్మకం కుదిరింది. ఇక ఈ సినిమాతో బన్నికి బాగా క్లోజ్ అయిన సుశాంత్.. అతని సినిమాకు బన్నిని వాడేయాలని ఫిక్స్ అయ్యాడని తెలుస్తుంది. ప్రస్తుతం సుశాంత్ ఇచట వాహనములు నిలుపరాదు సినిమా చేస్తున్నాడు. ఎస్.దర్శన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా లో సర్ ప్రైజ్ రోల్ లో అల్లు అర్జున్ కనిపిస్తారట.

 

సినిమాలో ఓ ప్రత్యేకమైన సన్నివేశంలో అల్లు అర్జున్ సుశాంత్ తో కలిసి నటిస్తాడట. కచ్చితంగా బన్ని స్పెషల్ అప్పియరెన్స్ సుశాంత్ సినిమాకు చాలా ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. అక్కినేని ఫ్యామిలీ హీరోగా తన సత్తా చాటాలని చూస్తున్న సుశాంత్ చిలసౌ సినిమాతో పర్వాలేదు అనిపించుకున్నాడు. ఇచట వాహనములు నిలుపరాదు సినిమా కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న సినిమా అని తెలుస్తుంది. ఈ సినిమాకు సంబందించిన మరిన్ని డీటైల్స్ త్వరలో బయటకువస్తాయి. సుశాంత్ మాత్రం ఇక మీదట తన కెరియర్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: