మాస్ మహరాజ్ రవితేజ హీరోగా వి.ఐ.ఆనంద్ డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా డిస్కో రాజ. ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రాం తాళ్లూరి నిర్మించిన ఈ సినిమాలో రవితేజ సరసన నభా నటేష్, రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్, తన్య హోప్ హీరోయిన్స్ గా నటించారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా రిలీజ్ మరో రెండు రోజులు మాత్రమే ఉండగా సినిమా రిలీజ్ వాయిదా పడుతుందన్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. అదేంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు వచ్చి మరో రెండు రోజుల్లో సినిమా ఉందని వారు కూడా చెప్పగా ఈ టైం లో సినిమాను ఎవరు ఆపేస్తారు అంటే.. ఆల్రెడీ సంక్రాంతి సినిమాల తాకిడి నెల చివర వరకు ఉంటుందని జనవరి నెల చివరన డిస్కో రాజా రిలీజ్ పెట్టుకున్నారు.

 

అయితే సడెన్ గా జనవరి 24కి ప్రీ పోజ్ చేశారు. అసలైతే ఈ డిస్కో రాజా 2019 డిసెంబర్ 20నే రిలీజ్ కావాల్సి ఉన్నా అప్పుడు విపరీతమైన పోటీ ఉండటం వల్ల రిలీజ్ ఆపేశారు. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన సమస్య ఏంటంటే.. ఆల్రెడీ సంక్రాంతికి వచ్చిన సినిమాలు ఇంకా థియేటర్స్ లో ఉండటం వల్ల రవితేజ డిస్కో రాజాకి మంచి థియేటర్స్ దొరకలేదని తెలుస్తుంది. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్ ఎంత ట్రై చేసినా సిటీల్లో ఏవో కొన్ని చోట్ల తప్ప మిగిలిన చోట మాత్రం పరిస్థితి దారుణంగా ఉందని తెలుస్తుంది.

 

అయితే చివరి నిమిషం వరకు థియేటర్లు నిర్ణయించని పరిస్థితి కూడా కనబడుతుంది. అందుకే డిస్కో రాజా మరో వారం వాయిదా పడినా పడొచ్చనే రూమర్ ఫిల్మ్ నగర్ లో వినిపిస్తుంది. రవితేజ ఎన్నో హోప్స్ పెట్టుకున్న ఈ సినిమా ఆల్రెడీ ఒకసారి రిలీజ్ పోస్ట్ పోన్ అవగా ఈసారి కూడా వాయిదా పడితే సినిమా మీద ఇప్పటివరకు ఏర్పడిన ఆసక్తి అంతా తగ్గిపోయే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: