దర్బార్, సరిలేరు నీకెవ్వరు, అల.. వైకుంఠపురములో  చిత్రాలకు పోటీగా ఈ సంక్రాంతి బరిలో  నిలిచిన చిత్రం కళ్యాణ్ రామ్ నటించిన ఎంత మంచి వాడవురా .. ఈనెల 15న విడుదలైన ఈ చిత్రం నెగిటివ్  రివ్యూస్ ను తెచ్చుకున్నా బాక్సాఫీస్ వద్ద మొదటి రెండు రోజులు ఓకే అనిపించింది. అయితే నెగిటివ్ టాక్ కు తోడు సరిలేరు నీకెవ్వరు , అల వైకుంఠపురములో  దాటికి  ఆతరువాత చేతులెత్తే సింది. నిన్న ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో కేవలం 14లక్షల షేర్ ను మాత్రమే రాబట్టిందంటే  ఈ సినిమా పరిస్థితి ఎలావుందో అర్ధం చేసుకోవచ్చు.
 
ఇక 7రోజుల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 6.60 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.  బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 3కోట్లు రాబట్టాల్సివుంది.  అయితే  ఫుల్ రన్ లో ఈ చిత్రం  30లక్షలు కూడా రాబట్టడం కష్టమే సో  ఈసినిమా డిజాస్టర్ జాబితాలో  చేరనుంది. అయితే నిర్మాతలకు మాత్రం నష్టం ఏమిలేదు.  నాన్ థియేట్రికల్  రూపంలో  ప్రాఫిట్ జోన్ లోనే వున్నారు. ఎటొచ్చి సినిమాను కొన్న బయ్యర్లే మునుగనున్నారు.  
 
ఫ్యామిలీ డ్రామాగా  శతమానం  భవతి  ఫేమ్ సతీష్ వేగేశ్న  డైరెక్ట్ చేసిన  ఈ చిత్రంలో మెహ్రీన్ హీరోయిన్ గా నటించగా గోపి సుందర్ సంగీతం అందించాడు. ఆదిత్య మ్యూజిక్ అధినేత ఉమేష్ గుప్తా , శ్రీదేవి మూవీస్ అధినేత శివ లెంక  కృష్ణ ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక గత ఏడాది 118తో హిట్ కొట్టి మళ్ళీ  ట్రాక్  లోకి వచ్చిన కళ్యాణ్ రామ్ కు  తాజాగా ఎంత మంచివాడవురా షాక్ ఇచ్చింది. ఈ చిత్రం తరువాత  కళ్యాణ్ రామ్ ఇప్పటివరకు మరో చిత్రానికి  గ్రీన్ సిగ్నల్  ఇవ్వలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: