రాజా ది గ్రేట్  తరువాత వరసగా మూడు డిజాస్టర్ల తరువాత  మాస్ మహారాజ్ రవితేజ , డిస్కోరాజా తో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు . అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం  ఈనెల 24న విడుదలకానుంది. ఇటీవల విడుదలైన టీజర్ , సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకోవడంతో సినిమా పై మంచి అంచనాలే వున్నాయి. ఇక ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే  20కోట్లు రాబట్టాల్సి వుంది. అయితే హిట్ టాక్ వస్తే ఇదేమి పెద్ద కష్టం కాకపోవచ్చు.  ఎక్కడికిపోతావు చిన్నవాడా ఫేమ్ విఆనంద్ డైరెక్షన్ లో   సైన్టిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో  నాభా నటేష్ , రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ , తాన్యా హోప్   కథానాయికలుగా నటించగా ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్మెంట్స్  బ్యానర్ పై భారీ బడ్జెట్ తో  రవి తాళ్లూరి నిర్మించాడు.  ఈచిత్రానికి తమన్ సంగీతం అందించగా కోలీవుడ్ నటుడు బాబీ సింహ విలన్ గా నటించాడు. 
 
ఇదిలావుంటే రవితేజ ప్రస్తుతం  గోపిచంద్ మలినేని డైరెక్షన్ లో క్రాక్ అనే సినిమా చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈచిత్రంలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండగా  ఆయనకు జోడీగా శృతి హాసన్ నటిస్తుంది. వీరితో పాటు తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ ఈచిత్రాన్ని ఠాగూర్ మధు  నిర్మిస్తున్నాడు. సమ్మర్ లో ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది. ఇక  రవితేజ -గోపిచంద్ కాంబినేషన్ లో ఇది మూడో సినిమా. ఇంతకుముందు వీరి కలయికలో తెరకెక్కిన డాన్ శీను యావరేజ్ అనిపించుకోగా  బలుపు సూపర్ హిట్ అయ్యింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: