హీరోయిన్లు ఏం చేసినా అందంగానే కనిపిస్తుంది.  ఎందుకంటే వారు సెలెబ్రిటీలు.  సెలెబ్రిటీలు టీవీ, సినిమాల్లో తప్పించి బయట రోడ్డుపై మాములుగా కనిపించడమే చాలా తక్కువ.  అలాంటిది రోడ్డుమీదకు వచ్చి కౌగిలింతలు ఇస్తామంటే యువత ఊరుకుంటుందా చెప్పండి.  క్యూలో నిలబడి వెళ్లి కౌగిలించుకోరా చెప్పండి.  బాలీవుడ్ హీరోయిన్ ఏంటి కౌగిలించుకోవడం ఏంటి అని షాక్ అవుతున్నారా ? అక్కడికే వస్తున్నా... సహజంగా ప్రతి మనిషికి ఒత్తిడి అన్నది ఉంటుంది.  ఒత్తిడి పెరిగినపుడు మనిషి ఆటోమాటిక్ గా ఇబ్బందులు పడతాడు.  


ఒత్తిడిలో మనిషి పనిచేయడం అంటే చాలా కష్టమైన విషయంగా చెప్పాలి.  కష్టమే కావొచ్చు.  దానితో పాటు ఇబ్బంది కూడా ఉంటుంది.  ఒత్తిడిని జయించాలి అంటే మనిషి తప్పనిసరిగా కౌగిలించుకోవాలి.  కౌగిలింత అన్నది మనిషి ఒత్తిడి నుంచి కొంతవరకు రిలీఫ్ ఇస్తుంది.  కౌగిలింత వలన వచ్చే రిలీజ్ అంతాఇంతా కాదు.  చాలా వరకు స్ట్రెస్ నుంచి తగ్గించవచ్చు.  అందుకే విదేశాల్లో అప్పుడప్పుడు అలా కౌగిలించుకుంటూ ఉంటారు.  స్ట్రెస్ రిలీఫ్ కావాలి అంటే అదొక్కటే మార్గం.  


ఇకపోతే, బాలీవుడ్ హీరోయిన్ రిచా చద్దా ముంబైలో వినూత్నమైన ప్రోగ్రామ్ పెట్టింది.  అదేమంటే, స్ట్రెస్ రిలీఫ్ కోసం ఉచిత కౌగిలింత అన్నమాట. ఉచిత కౌగిలింత అనే బోర్డు పట్టుకొని ముంబై వీధుల్లో నిలబడింది.  ఫ్రీ హగ్ బోర్డు పట్టుకొని నిలబడితే, అందులో బాలీవుడ్ హీరోయిన్ నిలబడితే చూస్తూ ఊరుకుంటారా చెప్పండి.  అటునుంచి వెళ్లే వారంతా కూడా వెళ్లి కౌగిలించుకుంటున్నారు.  అలా కౌగిలించుకోవడమే కాకుండా మంచి పని చేస్తున్నందుకు మెచ్చుకుంటున్నారు.  


ప్రపంచంలో ప్రతిదానికి ఓ డేట్ ఉంటుంది.  జనవరి 21 వ తేదికి కూడా ఓ ప్రాముఖ్యత ఉన్నది.  జనవరి 21 వ తేదీని జాతీయ కౌంగిలింతల దినోత్సవంగా పేర్కొంటారు.  ఆరోజును ఎలాగైనా వినియోగించుకోవాలని అనుకున్నది రిచా చద్దా.  అందుకోసమే ఫ్రీ హగ్ కార్యక్రమాని నిర్వహించింది.  అబ్బాయిలు ఇలా ఫ్రీ హగ్ అని బోర్డు పట్టుకుంటే ఎంతమంది వచ్చి కౌగిలించుకుంటారో తెలియదుగాని, అమ్మాయిలు నిలబడితే మాత్రం తప్పకుండా కౌగిలించుకుంటుంటారు. అమ్మాయిలు తలచుకుంటే ఏదైనా చేయగలరు అని. 

మరింత సమాచారం తెలుసుకోండి: