బాలయ్య హీరోగా బోయపాటి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడన్న విషయం తెలిసిందే. రూలర్ సినిమా డిజాస్టర్ తర్వాత బాలయ్య చేస్తున్న చిత్రమిది. నిజానికి బోయపాటి సినిమానే రూలర్ కంటే ముందుగా చేయాల్సింది. కానీ అనుకోని కారణాల వల్ల రూలర్ సినిమా పట్టాలెక్కి బోయపాటిని వెయిట్ చేయించాల్సి వచ్చింది. రూలర్ సినిమా ఫ్లాప్ తర్వాత బాలయ్య చేస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి.

 

 

రూలర్ ద్వారా వచ్చిన చెడ్డ పేరును ఈ సినిమా పూర్తిగా చెరిపేస్తుందని అనుకుంటున్నారు. ఇప్పటి వరకు బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో రెండు చిత్రాలు వచ్చాయి. ఈ రెండు చిత్రాలు ఒకదానిని మించి మరోటి విజయం సాధించాయి. అందువల్ల హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఖచ్చితంగా హిట్ సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. అయితే ఈ సినిమా నుండి ఒక ఆసక్తికరమైన అప్డేట్ బయటకి వచ్చింది.

 

ఈ సినిమాలో బాలయ్య కొన్ని సీక్వెన్స్ లో పూర్తి ఆధ్యాత్మిక వేత్తగా కనిపించబోతున్నాడని.. ఆలాగే ఆధ్యాత్మికతతో మొదలైన బాలయ్య పాత్ర కూడా చాల వైవిధ్యంగా అలాగే ప్రేరణాత్మకంగా ఉండబోతుందని తెలుస్తోంది. అయితే బాలయ్య అసలు ఆధ్యాత్మిక వేత్తగా ఎలా మారాడు ఆయన గతం ఏమిటి అనే కోణంలో ఓ పవర్ ఫుల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ప్లాష్ బ్యాక్ కూడా వస్తోందట. అయితే ఇప్పటి వరకు బాలయ్యని అలా చూడని అభిమానులకి ఈ పాత్ర బాగా నచ్చుతుందట.

 

మరి ఆధ్యాత్మిక వేత్తగా బాలయ్య ఎలాంటి మాయ చేస్తాడో చూడాలి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో విలన్ గా హీరో శ్రీకాంత్ కనిపించనున్నారు. హీరోగా నెమ్మదించిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రలు చేస్తున్న శ్రీకాంత్ ఈ సినిమాలో విలన్ గా కనిపించడం ఆశ్చర్యమే. అయితే అంతకుముందు నాగచైతన్య సినిమా అయిన యుద్ధం శరణం సినిమాలోనూ శ్రీకాంత్ విలన్ గా కనిపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: